శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఒకే ఒక జీవితం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.గత రెండు వారాలుగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
శర్వానంద్ మరియు సినిమాలో కీలక పాత్రలో నటించిన అమల అక్కినేని ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.విభిన్నమైన ప్రమోషన్ కార్యక్రమాలు చేయడం ద్వారా సినిమాని జనాల్లోకి తీసుకు వెళ్లారు.
ఇది ఒక టైం ట్రావెల్ స్టోరీ అంటూ ముందే క్లారిటీ ఇచేసిన చిత్ర యూనిట్ సభ్యులు ఒక మంచి సెంటిమెంట్ సినిమా అంటూ చెబుతూ ప్రచారం చేస్తున్నారు.ఈ సినిమా సక్సెస్ అయితే ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్ట్ కే తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ అభిమానులు ధీమాతో ఉన్నారు.
ఎందుకంటే ఒకే ఒక జీవితం టైం ట్రావెల్ సినిమా.ఇటీవల వచ్చిన బింబిసారా కూడా టైం ట్రావెల్ సినిమా.
అంతకు ముందు కూడా కొన్ని టైం ట్రావెల్ సినిమాలు వచ్చాయి.అవన్నీ కూడా విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
కనుక ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ అయితే ముందు రాబోతున్న ప్రాజెక్ట్ కే సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ కొందరు సెంటిమెంట్ నమ్ముతున్నారు.
నిజంగానే ఈ లాజిక్ ఏదో కరెక్టుగా ఉంది అనిపిస్తుంది.
గతంలో వచ్చిన టైం ట్రావెల్స్ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ముందు రాబోతున్న సినిమాలపై ఆసక్తి ఉండడం చాలా కామన్.కనుక ప్రభాస్ సినిమా పై ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిని కనబరిచే అవకాశం ఉంది.
శర్వానంద్ నటించిన ఈ సినిమా కనుక సూపర్ హిట్ అయితే తప్పకుండా ప్రభాస్ సినిమా కోసం ప్రేక్షకులు మరింత ఆసక్తితో ఎదురు చూసే అవకాశం ఉంది.గతంలో అద్భుతమైన టైం ట్రావెల్ సినిమాను తెరకెక్కించిన సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
కనుక ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.మరో ఆదిత్య 369 రేంజ్ లో అద్భుతంగా ఉంటుంది అంటూ ప్రభాస్ అభిమానులు ధీమాతో ఉన్నారు.మరి ఆయన అభిమానులు నమ్మకంను ఎంత వరకు ఈ సినిమా నిలబెడుతుంది అనేది చూడాలి.







