మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ జెట్ స్పీడ్ లో సినిమాలు పూర్తి చేస్తున్నాడు.సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఖైదీ నెం 150, సైరా వంటి సూపర్ హిట్స్ అందుకున్నాడు.
అయితే ఇటీవలే ఆచార్య సినిమా ఎన్నో అంచనాల మధ్య వచ్చి మెగాస్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచి పోయింది.దీంతో ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చేసే సినిమాలపై మరింత ఫోకస్ పెట్టి ఆ ప్లాన్ ను మరిపించాలని మరింత కృషి చేస్తున్నాడు.
ప్రెసెంట్ చిరు చేతిలో మూడు నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి.వాటిలో గాడ్ ఫాదర్ ఒకటి.తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది.
చిరంజీవి 153వ సినిమాగా ఈ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకుని చివరి దశకు చేరుకుంది.

ఈ సినిమా అక్టోబర్ 5న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి ఓ వార్త వైరల్ అయ్యింది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చే గెస్ట్ గురించి మెగా ఫ్యాన్స్ లో ఇప్పటి నుండే ఆసక్తి నెలకొంది.
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చే గెస్ట్ గురించి అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమా ఈవెంట్ కు గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది.
అందుకే ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ మరింత ఎక్కువ అయ్యింది.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.అందుకే ఈ సినిమాను తెలుగు తో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అలాగే థమన్ సంగీతం అందిస్తుండగా.
సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, ఆర్ .బి .చౌదరి నిర్మిస్తున్నారు.







