ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా అన్ని ఓటీటీల్లా కేవలం సినిమాలు, వెబ్ సీరీస్ లే కాకుండా స్పెషల్ రియాలిటీ షోస్ ప్లాన్ చేస్తున్నారు.సెలబ్రిటీ చిట్ చాట్ షోస్ ఓ పక్క సింగింగ్ కాంపిటీషన్ మరో పక్క ఇలా తెలుగు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్ అందిస్తున్న ఆహా ఇప్పుడు సరికొత్త డ్యాన్స్ షోతో వస్తుంది.
డ్యాన్స్ ఐకాన్ అంటూ రాబోతున్న ఈ షో సెప్టెంబర్ 11 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.ఈ షో కోసం ఆహా టీం తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.
ఇక డ్యాన్స్ ఐకాన్ షోకి జడ్జ్ గా శేఖర్ మాస్టర్ ఒకరు సెలెక్ట్ అవగా మరో జడ్జ్ గా సీనియర్ యాక్ట్రెస్ రమ్యకృష్ణని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.ఈ షో కోసం రమ్యకృష్ణకి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట ఆహా టీం.బాహుబలిలో శివగామి పాత్రలో మెప్పించిన రమ్యకృష్ణ రీసెంట్ గా వచ్చిన లైగర్ సినిమాలో కూడా మదర్ రోల్ లో అదరగొట్టారు.ఇప్పుడు ఆహా డ్యాన్స్ ఐకాన్ లో జడ్జ్ గా వ్యవహరించనున్నారు.
ఈ షోలో యశ్ మాస్టర్, శ్రీముఖి, మోనాల్ గజ్జర్ లు కూడా పాల్గొంటున్నారు.







