వైరల్: టక్కరి దొంగ... మహిళల లోదుస్తులు దోచుకుంటున్న వైనం... వీడియో వైరల్! 

దొంగలతో టక్కరి దొంగ వేరయా? అన్నట్టు, ఆ దొంగ చేసిన పనులు తెలిస్తే అవాక్కవుతారు.అతడు అందరూ నిద్రపోయాక మేల్కొంటాడు.

అర్ధరాత్రి తీరిగ్గా వీధి పర్యటనకు బయలుదేరుతాడు.అందరి కళ్లు గప్పి పైకప్పు లేదా గేటు ద్వారా ఇళ్లలోకి ప్రవేశిస్తాడు.

ఇంత బాగా ప్లాన్‌ చేసి, అతను ఏదో భారీ చోరీలు చేస్తుంటాడు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.అవును.

ఆ యువకుడు బయట ఆరేసిన మహిళల లోదుస్తులు తప్ప ఇంకేమి ముట్టుకోడు.మహిళల బ్రాలు, ఇన్నర్ వేర్లను మాత్రమే దొంగలిస్తున్నాడు.

Advertisement

అయితే వీటిపై ఫిర్యాదు చేస్తే బాగుండదని మహిళలు కూడా ఎవరూ ముందుకు రావడంలేదు.ఇక సదరు మహిళల బాధను అర్ధం చేసుకున్న ఓ వ్యాపారి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో ఈ వెరైటీ దొంగ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది.వివరాల్లోకి వెళితే, ఆకాష్ వర్మ అనే యువకుడు గ్వాలియర్‌లో మహిళల లోదుస్తులు, ఇన్నర్‌లను దొంగతనం చేస్తున్నాడు.

అర్ధరాత్రి దాటిన తర్వాత ఆకాష్ పైకప్పు లేదా గేట్ ద్వారా ఇళ్లలోకి ప్రవేశించి ఉతికేసిన మహిళల లోదుస్తులను చోరీ చేస్తున్నాడు.ఇలా గ్వాలియర్‌ ప్రాంతంలో చాలా ఇళ్లలో దొంగతనాలు చేశాడు.

ఆరేసిన లోదుస్తులు, ఇన్నర్‌ లు ఏమవుతున్నాయో తెలియక మహిళలు అందరూ అయమయానికి గురయ్యారు.అయితే లోదుస్తులు పోయాయని ఫిర్యాదు ఇస్తే బాగుండదని ఎవరూ ముందుకు రాలేదు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

ఇక ఆకాష్ ఎప్పటిలాగే తాజాగా అర్ధరాత్రి దాటిన తర్వాత తలుపులు బార్లా తెరిచి ఉన్న ఓ ఇంటిలోకి వెళ్లాడు.చాలా సమయం తర్వాత చేతిలో మహిళల లోదుస్తులు పట్టుకుని బయటికి వచ్చాడు.

Advertisement

ఈ తతంగం అంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.దీంతో అర్ధరాత్రి ఓ దొంగ తన ఇంట్లోకి ప్రవేశించి తన భార్య లోదుస్తులను దొంగిలించాడని ఓ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

వ్యాపారి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితుడు ఆకాశ్‌ను గుర్తించారు.త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.

తాజా వార్తలు