బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన బ్రహ్మాస్త్ర సినిమా ను ఈ వారం ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.దాదాపు గా 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కేవలం హిందీ లో ఆడితే సరిపోదు.
సౌత్ ఇండియా మొత్తం లో కూడా భారీ ఎత్తున విడుదల అయ్యి సక్సెస్ అవ్వాల్సి ఉంది.అక్కడ ఇక్కడ సక్సెస్ అయి భారీ వసూలను సొంతం చేసుకున్నప్పుడు మాత్రమే సినిమా కు బ్రేక్ ఈవెన్ సాధ్యమవుతుంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం చేస్తున్నారు.
అందుకే సౌత్ ఇండియా లో ఈ సినిమా కు భారీ ఎత్తున ప్రమోషన్ చేస్తున్నారు.కేవలం తెలుగు లోనే మూడు సార్లు ప్రెస్ మీట్ కార్యక్రమాలను నిర్వహించారు.
రాజమౌళి ఈ సినిమా కు సమర్పకుడు అవ్వడం వల్ల భారీ గా ప్రమోషన్స్ చేస్తున్నారు.అంతే కాకుండా పెయిడ్ ప్రమోషన్స్ కోసం పలు కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
సుమ క్యాష్ షో లో సందడి చేసిన రణబీర్ ఆలియా ఇతర టీమ్ ఆ తర్వాత బిగ్ బాస్ కార్యక్రమం లో కూడా సందడి చేశారు.ఇక రెండున్నర కోట్ల తో రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నారు.
అందుకోసం రెండున్నర కోట్ల రూపాయలను ఖర్చు కూడా చేశారు.కానీ చివరి నిమిషం లో ఆ కార్యక్రమం రద్దు అయింది.అయినా కూడా వెంటనే మరో 10 నుండి 20 లక్షలు ఖర్చు చేసి ప్రముఖ హోటల్లో ప్రెస్ మీట్ ని నిర్వహించారు.అలా మొత్తానికి బ్రహ్మాస్త్ర సినిమా కోసం ఐదున్నర నుండి 6 కోట్ల రూపాయల వరకు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే పబ్లిసిటీ కోసం ఖర్చు చేశారు అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
ప్రస్తుతం సినిమా పై తెలుగు రాష్ట్రాల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.కానీ సినిమా సక్సెస్ అయితేనే వసూలు వస్తాయని సినిమా కు మిశ్రమ స్పందన వచ్చిన కూడా వసూళ్లు ఆశించిన స్థాయిలో వచ్చే అవకాశం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ వంటి స్టార్ ఈ సినిమా కు ప్రమోటర్ గా ఉండటం వల్ల ఏమైనా ఫలితం ఉంటుందేమో చూడాలి.







