మీరు ఎక్కాల్సిన ట్రైన్ లేట్ అయితే.. మీకు ఈ సేవలు ఫ్రీ..

సామాన్యులు ఎవరైనా దూర ప్రయాణాలు చేయాలంటే ఎక్కువగా ట్రైన్ మీదే ఆధారపడతారు.మనం కూడా చాలా సార్లు రైలు ప్రయాణాలు చేసి ఉంటాం.

 If Your Train Is Late These Services Are Free For Yo Train, Late, Services, Ra-TeluguStop.com

అయితే అప్పుడప్పుడు రైళ్లు ఆలస్యంగా వస్తుంటాయి.అప్పుడు మనకు చిరాకు వస్తుంది.

అంతేకాదు ఆలస్యం కారణంగా గమ్యాన్ని సమయానికి చేరుకోలేం.ఈసమస్యను ట్రైన్ జర్నీ చేసేవారు ఎప్పుడో ఒకసారి ఎదుర్కొనే ఉంటారు.

అయితే.ట్రైన్ లేటు అయినప్పుడు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా రైల్వే శాఖ కొన్ని సేవలు అందిస్తోంది.

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కొన్ని ఉచిత సర్వీస్ లను తీసుకొచ్చింది.ఆ సర్వీసులు ఏంటో చూద్దాం.

రైల్వే శాఖ అందించే సేవలు

మీరు ప్రయాణించాల్సిన రైలు షెడ్యూల్ చేసిన సమయానికి రాకపోతే IRCTC కొన్ని సేవలు అందిస్తోంది.రైలు ఆలస్యం అయినట్లయితే మీకు ఉచితంగా ఆహారం, ఒక కూల్ డ్రింక్ అందిస్తుంది.

ఇండియన్ రైల్వే నిబంధనల ప్రకారం రైలు లేట్ అయినప్పుడు IRCTC క్యాటరింగ్ ద్వారా ప్రయాణికులకు అల్పాహారం, తేలికపాటి భోజనం అందిస్తారు.

ఈ సేవలు ఎప్పుడు అందిస్తారు

Telugu Journey, Railway, Train, Travel-Latest News - Telugu

IRCTC ప్రకారం.మీరు ప్రయాణించాల్సిన రైలు 30 నిమిషాలు ఆలస్యం అయినప్పుడు ఈ సర్వీస్ అందించబడదు.ట్రైన్ 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ లేట్ అయినప్పుడు మాత్రమే ఈ సదుపాయం పొందగలరు.

శతాబ్ధి, రాజధాని, సహా అన్ని ఎక్స్ ప్రెస్ ట్రైన్స్ ప్రయాణికులకు ఈ సదుపాయం ఉంటుంది.

ట్రైన్ లేట్ అయితే ఏం ఇస్తారు

IRCTC ప్రకారం.అల్పాహారంలో టీ లేదా కాఫీ, రెండు బిస్కెట్లు.సాయంత్రం స్నాక్స్ లో టీ లేదా కాఫీ, నాలుగు బ్రెడ్ స్లయిస్ లు, ఒక బటర్ చిపోటిల్.

లంచ్ సమయంలో అన్నం, పప్పు, ఊరగాయ ప్యాకెట్లు, 7 పూరీలు, మిక్స్ వెజ్ లేదా ఆలూ భాజీ, ఒక ప్యాకెట్ ఊరగాయ అందిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube