ప్రభాస్ సరసన రెబల్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం అనుష్క ఎలా కోల్పోయింది తెలుసా ?

డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాలతో సూపర్ ఫామ్ లో ఉన్న ప్రభాస్ హ్యాట్రిక్ హిట్టు కొట్టాలని భావించి రెబల్ వంటి సినిమా చేసి ఘోర పరాజయాన్ని అందుకున్నాడు.రాఘవ అప్పటికే డాన్, కాంచన సినిమాలు చేసి సూపర్ ఫామ్ లో ఉన్నాడు అందుకే అతడు కథ చెప్పగానే ప్రభాస్ ఓకే చెప్పాడు.

 How Anushka Missed Rebal Movie Chance Details, Anushka, Rebel Movie, Hero Prabha-TeluguStop.com

ఇక 2012లో విడుదలైన ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించిన తమన్నా మొదటి హీరోయిన్ గా దీక్షాసేత్ రెండవ హీరోయిన్ గా నటించింది.ఇక ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తూ సంగీత దర్శకత్వం కూడా చేపట్టి కొరియోగ్రఫీ అందించాడు.

అయితే ఇక్కడ మనకు తెలియని విషయం ఏమిటి అంటే ఈ చిత్రంలో తమన్నా పాత్ర కోసం తొలుత అనుష్కాని అనుకున్నారట.అనుష్క కూడా మొదట ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించడానికి ఓకే చెప్పినా, అనుకున్న సమయానికి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది.దాంతో ఈ పాత్ర తమన్నాకి వెళ్ళింది.ఏది ఏమైనా ఈ సినిమా పరాజయం పాలవడంతో ఒక ఫ్లాప్ సినిమా నుంచి అనుష్క బయట పడింది అనుకోవచ్చు.

అయితే ఈ జంట ఈ సినిమా తర్వాత శివ దర్శకత్వం వహించిన మిర్చి సినిమాలో కలిసి నటించారు.ప్రభాస్ లాంటి ఆజానుబాహుడికి ఒడ్డు పొడవు సరిగ్గా సూటయ్యే హీరోయిన్ అనుష్క అయితే బాగుంటుంది అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

Telugu Anushka, Anushka Shetty, Diksha Seth, Prabhas, Mirchi, Prabhas Rebel, Pra

కొరటాల శివ సైతం తన హీరోయిన్ అనుష్క అనే గట్టిగా అనుకున్నాడు.అంతకుముందు రెబల్ సినిమా అవకాశాన్ని కోల్పోయిన అనుష్క సైతం ఈ సినిమా కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించింది.అలా ఈ చిత్రం మంచి హిట్ అయినప్పటికీ రెబల్ లాంటి సినిమాలో మాత్రం నటించడం అనుష్కకి కుదరలేదు.ఆ తర్వాత బాహుబలి వంటి సినిమాతో వీరిద్దరి కాంబినేషన్ కి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడింది.

సినిమాల్లో నటించేసరికి వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు సోషల్ మీడియాలో బాగా చెక్కర్లు కొట్టాయి.అయితే తామిద్దరము మంచి స్నేహితులకు మాత్రమే అంటూ ఇద్దరు కొట్టి పారేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube