ఆర్ఆర్‌ఆర్‌ మాత్రమే కాదు... కేజీఎఫ్ 2 కి కూడా అదే చేదు ఫలితం

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్‌.సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

 Rrr And Kgf 2 Movies Tv Rating Same To Same , Flim News, Kgf2, Ntr, Rajamouli, R-TeluguStop.com

డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా కూడా దాదాపు 100కు పైగా దేశాల్లో ఈ సినిమా హంగామా చేసింది.నాలుగైదు వారాల పాటు నెట్లిక్స్ లో అంతర్జాతీయ స్థాయిలో ట్రెండింగ్లో నిలిచి ఇంగ్లీష్ సినిమాలకు పోటీ అన్నట్లుగా బలంగా ట్రెండ్ అయింది.

థియేటర్లు మరియు డిజిటల్ సూపర్ హిట్ అయిన ఈ సినిమా శాటిలైట్ టెలికాస్ట్ లో మాత్రం దారుణమైన పరాజయాన్ని చవి చూసినట్లుగా బుల్లి తెర వర్గాల వారు చర్చించుకుంటున్నారు.చాలా తక్కువ రేటింగ్ రావడానికి కారణం ఏంటి అనేది ఇంకా తెలియ రాలేదు కానీ ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషించుకుంటున్నారు.

ఎక్కువ శాతం మంది సినిమాను థియేటర్లో లేదా ఓటీటీ లో చూశారు కనుక టీవీల్లో చూసేందుకు ప్రేక్షకుల ఆసక్తి చూపించలేదని మెజార్టీ మెంబర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు అదే పరిస్థితి కన్నడ చిత్రం కేజిఎఫ్ 2 కి కూడా ఎదురయింది.

మరి దారుణమైన రేటింగ్ తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాకు ఇచ్చారు.భారీ అంచనాల నడుమ గత వారం ప్రేక్షకుల ముందుకు బుల్లితెర ద్వారా వచ్చిన కేజిఎఫ్ 2 సినిమా అత్యంత తక్కువ రేటింగ్ ని దక్కించుకుంది అంటూ సమాచారం అందుతుంది.

రాజమౌళి సినిమా కంటే కూడా దారుణంగా ఆ సినిమా రేటింగ్ ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం వెయ్యి కోట్లు వచ్చిన కేజిఎఫ్ 2 సినిమా ని ఎక్కువ శాతం మంది థియేటర్లలో లేదా డిజిటల్ ప్లాట్ఫామ్ పైనే చూశారు. కనుక బుల్లి తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎవరు మిగలలేదు అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.

మొత్తానికి ఒకప్పుడు బుల్లి తెరపై సినిమా అంటే ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఎదురు చూసేవారు, కానీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా ఎక్కువ శాతం మంది చూస్తూ ఉండడంతో టీవీల్లో చూసే వారు తక్కువయ్యారు.ముందు ముందు ఎలాంటి రేటింగులను చూడాల్సి వస్తుందో.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube