Alert: ఈ విషయం తెలుసా? ఇకనుండి టికెట్లు క్యాన్సిల్‌ చేసుకున్నా 5% GST పే చేయాల్సిందే!

ఆల్రెడీ కన్ఫామ్ అయిన విమాన, రైలు, హోటల్ మొదలగు టిక్కెట్లు రద్దు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకొక షాకింగ్ న్యూస్.టిక్కెట్ల రద్దు చేసుకోవాలంటే చార్జీలు చెల్లించాలని అందరికీ తెలుసు.

 Alert: ఈ విషయం తెలుసా? ఇకనుండి టిక-TeluguStop.com

అయితే ఇకనుండి రద్దు చార్జీలపైన కూడా GST (వస్తు సేవల పన్ను) కట్టాల్సి ఉంటుంది.ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త రకం GST విధింపుపై సర్క్యులర్ జారీ చేసింది.

ఆగస్టు 3వ తేదీన ఆర్థిక మంత్రిత్వ శాఖ పన్ను పరిశోధన విభాగం జారీ చేసిన ఈ సర్క్యులర్ ప్రకారం టిక్కెట్ల బుకింగ్ అనేది ఒక ‘కాంట్రాక్టు’ అని అని తెలిపింది.దీని కింద సర్వీస్ ప్రొవైడర్ వినియోగదారుడికి సేవలను అందిస్తానని హామీ ఇస్తుందని తెలిపింది.

అందువలన ఇకనుండి టిక్కెట్లు రద్దు చేసుకున్నా సరే పన్ను చెల్లించాల్సిందే అని స్పష్టం చేసింది.ఈ నోటిఫికేషన్ ప్రకారం, ఫస్ట్ క్లాస్ లేదా AC కోచ్ టిక్కెట్‌ను రద్దు చేసేందుకు క్యాన్సెలేషన్ చార్జీపై అదనంగా 5% GST విధిస్తారు.

విమాన ప్రయాణం, హోటల్ టిక్కెట్లను క్యాన్సిల్ చేసినా 5% పన్ను కట్టాల్సి ఉంటుంది.టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు వర్తించే GST రేటునే రద్దు చేసుకున్నప్పుడు కూడా వర్తింపచేస్తున్నారు.

క్యాన్సెలేషన్ ఫీజు అనేది ఒప్పంద ఉల్లంఘనకు బదులుగా జరిగే చెల్లింపు కాబట్టి దానిపై జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Telugu Gst Paid, Fee, Hotel, Tickets, Tollywood, Train-Latest News - Telugu

“దీన్ని క్యాన్సెలేషన్ చార్జీగా వసూలు చేస్తారు.క్యాన్సెలేషన్ చార్జీ అనేది ఒప్పందాన్ని ఉల్లంఘించడం కాదు.అది ఒక పేమెంట్ మాత్రమే.

కాబట్టి దానికి GST వర్తిస్తుంది” అని సదరు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.అయితే ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి.

రైల్వే ప్రయాణాల్లో ఫస్ట్ క్లాస్, AC కోచ్ టిక్కెట్ల బుకింక్స్ పైనే 5% జీఎస్టీ విధిస్తున్నారు.సెకండ్ క్లాస్, ఇతర తరగతులకు GST లేదు.

కాబట్టి, ఫస్ట్ క్లాస్, AC కోచ్ ల టిక్కెట్లు రద్దు చేస్తేనే.క్యాన్సెలేషన్ ఫీజుపై అదనంగా GST కట్టాల్సి ఉంటుందని గుర్తించుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube