చిరంజీవి మూవీ విషయంలో ఒకటి తక్కువైందా.. మ్యాజిక్ రిపీట్ చేయాలంటూ?

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య మూవీ ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందనే సంగతి తెలిసిందే.ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగినా సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు చాలా తక్కువగా వచ్చాయి.

 This Is The Biggest Minus Point For God Father Movie Details, God Father, Chiran-TeluguStop.com

అయితే చిరంజీవి తర్వాత సినిమా గాడ్ ఫాదర్ థియేటర్లలో రిలీజ్ కావడానికి నెలరోజుల సమయం మాత్రమే ఉంది.సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారనే సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో అభిమానులు ఫీలవుతున్నారు. గాడ్ ఫాదర్ సినిమా కమర్షియల్ సినిమానే అయినప్పటికీ చిరంజీవికి జోడీగా హీరోయిన్ లేకపోవడం ఈ సినిమాకు ఒక విధంగా మైనస్ అనే సంగతి తెలిసిందే.

చిరంజీవి, సల్మాన్ కాంబినేషన్ లో వచ్చే సాంగ్ మాత్రమే ఈ సినిమాపై అంచనాలను ఒక విధంగా పెంచుతుందని చెప్పవచ్చు.

Telugu Acharya, Biggest Point, Chiranjeevi God, Chiranjeevi, Mohan Raja, God, Pu

చిరంజీవి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ రిపీట్ చేయాలంటే ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచక తప్పదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమా లూసిఫర్ రీమేక్ కావడంతో ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న లూసిఫర్ తెలుగు వెర్షన్ ను చాలామంది చూసేశారు.లూసిఫర్ ను మించి గాడ్ ఫాదర్ ఉంటే మాత్రమే కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉంటాయి.

Telugu Acharya, Biggest Point, Chiranjeevi God, Chiranjeevi, Mohan Raja, God, Pu

మరోవైపు చిరంజీవి రీమేక్ లకు దూరంగా ఉంటే మంచిదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ మధ్య కాలంలో రీమేక్ సినిమాలకు హిట్ టాక్ వచ్చినా స్ట్రెయిట్ సినిమాల స్థాయిలో ఈ సినిమాలు కలెక్షన్లను సాధించడం లేదు.అందువల్ల చిరంజీవి రీమేక్ సినిమాలకు దూరంగా ఉండాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చిరంజీవి మూవీ గాడ్ ఫాదర్ విషయంలో ప్రమోషన్స్, పబ్లిసిటీ తక్కువైందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube