అషు రెడ్డి ఇమేజ్ డ్యామేజ్.. ముసలమ్మలా ఉన్నావ్ అంటూ కామెంట్స్.. చీర ఖరీదు ఛీప్ అంటూ?

అషు రెడ్డి. బుల్లితెర ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Netizens Comments On Ashu Reddy Saree Viral On Social Media Details, Ashu Reddy,-TeluguStop.com

ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.పైగా ఇటీవలే పూర్తయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అవకాశం అందుకొని రెట్టింపు క్రేజ్ సంపాదించుకుంది.

తన గ్లామర్ తో మాత్రం కుర్రాళ్ళను పిచ్చెక్కించింది.ఈ బ్యూటీ ఇంట్లో కంటే నెట్టింట్లో సమయాన్ని గడుపుతుంది.

అషు రెడ్డి.డబ్స్మాష్ వీడియోలతో నెటిజన్లను పరిచయం అయింది.పైగా చూడటానికి సమంతలా కనిపించటంతో అందరి దృష్టిలో పడింది.అంతేకాదండోయ్.

ఎటువంటి అడ్డంకులు లేకుండానే వెండితెరపై కూడా అవకాశం అందుకుంది.ఇక గతంలో ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని ప్రేక్షకులకు పరిచయం అయింది.

ఈ షో తర్వాత అషు రెడ్డి కెరీర్ పీక్స్ లోకి వెళ్ళింది.మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఈమె పవర్ స్టార్ అభిమాని కావడంతో పవన్ అభిమానుల నుండి మరింత సపోర్టు సంపాదించుకుంది.ఆ తర్వాత బుల్లితెరలో ప్రసారమైన కామెడీ స్టార్ అనే కామెడీ షోలో లేడీ కమెడియన్ గా అడుగు పెట్టి తన కామెడీతో ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.

ఆ తర్వాత యాంకర్ రవి తో కలిసి ఓ షోలో యాంకర్ గా కూడా చేసి బాగా రెచ్చిపోయింది.అంతలోనే ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అవకాశం అందుకుంది.ఇక ఇందులో కూడా అషు మరింత క్రేజ్ సంపాదించుకుంది.ఇక ఇందులో మరో కంటెస్టెంట్ అజయ్ తో బాగా రచ్చ చేసింది.నిజానికి రెండుసార్లు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టింది అంటే తర్వాత తన పొజిషన్ ఇంకా బాగుంటుందని అనుకున్నారు.

కానీ ఇప్పటివరకు ఏ ప్రాజెక్టులలో అవకాశాలు అందుకున్నట్లు తెలియడం లేదు.ఇక సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటిలాగే యాక్టివ్ గా ఉంది.నిత్యం ఏదో ఒక పోస్ట్ చేయకుండా నిద్రపోతూ అషు రెడ్డి.

ఇక అప్పుడప్పుడు ఈమె చేసే పోస్టులను చూసి నెటిజన్లు దారుణమైన ట్రోల్స్, కామెంట్లు పెడుతూ ఉంటారు.అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తనకు నచ్చినట్లుగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టాలో ఒక పోస్ట్ షేర్ చేసుకుంది.అందులో తను చీర లుక్ లో కనిపించింది.

దీంతో ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో.ఆ ఫోటోలోని చూసిన నెటిజన్లు.

అచ్చం ముసలమ్మలా ఉన్నావు అంటూ కామెంట్స్ పెట్టారు.అంతేకాకుండా ఓ నెటిజన్ తాను కట్టుకున్న చీర ఖరీదు రూ.200 అంటూ దారుణంగా ట్రోల్స్ చేశారు.ప్రస్తుతం ఆ కామెంట్లు వైరల్ బాగా వైరల్ అవుతున్నాయి.

మరి ఈ కామెంట్లకు అషు రెడ్డి ఏమని స్పందిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube