బిగ్ బాస్ కంటెంట్ క్రియేటర్, నటి,హరియాణా బీజేపీ నేత, ప్రముఖ నటి సోనాలి ఫోగట్ అనుమానాస్పద స్థితిలో గోవాలో మృతి చెందిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈమె గుండెపోటుతో మృతి చెందారని మొదట్లో భావించిన అనంతరం ఈమె మరణం పై అనుమానాలు తలెత్తాయి.
ఇకపోతే ఈమె పోస్ట్ మార్టం నిర్వహించడంతో ఈమెది సాధారణ మరణం కాదని హత్యా అని తెలియడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.బలవంతంగా రిసార్ట్ లో ఈమెకు కొందరు డ్రగ్స్ ఇచ్చి తనని చంపారని సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా నిర్ధారించారు.
ఇక పోస్టుమార్టం రిపోర్టులో భాగంగా తన శరీరంపై కూడా గాయాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.ఈ క్రమంలోనే గోవా పోలీసులు ఈమె మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇకపోతే నటి సోనాలి ఫోగట్ సంజయ్ ఫోగట్ 2016 వ సంవత్సరంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.ఇలా ఈ భార్యాభర్తలిద్దరూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఈమె ఆస్తి కోసమే వీరిని చంపి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు.
ఇక రాజకీయాలలోనూ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సోనాలి సుమారు 110 కోట్ల విలువైన ఆస్తిపాస్తులను సంపాదించారని తెలుస్తోంది.
ఈ ఆస్తి కోసమే వీరిని చంపి ఉంటారని భావిస్తున్న వీరి బంధువులు ప్రస్తుతం తమ కూతురు యశోధర విషయంలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆస్తికోసం తనని ఏమైనా చేస్తారేమోనని భయపడిన తమ బంధువులు తనని హాస్టల్ కి కూడా పంపించకుండా తనకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాలని సోనాలి కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.ప్రస్తుతం 15 సంవత్సరాల వయసున్న యశోదర ప్రాణాలకు కూడా హాని ఉందని తమ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే సోనాలి మృతికి కారణమైన పలువురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.