తెలుగు ప్రేక్షకులకు రొమాంటిక్ సినిమా తో పరిచయమైన ముద్దు గుమ్మ కేతికా శర్మ మొదటి సినిమా రొమాంటిక్ లో పూరి ఆకాష్ తో కలిసి నటించిన సాధ్యమైనంత వరకు రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించడంతో పాటు అందాల ఆరబోత విషయం లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల తో పోటీ పడుతుందా అన్నట్లుగా అందాలను విందు చేసింది.ఆ సినిమా నిరాశపరచడం తో కేతికా శర్మ అందాల విందు బూడిద లో పోసిన పన్నీరు అన్నట్లుగా మారి పోయింది అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆమె అందం విషయం లో ఎలాంటి అనుమానం లేదు.కానీ ఆమె కు వచ్చిన మొదటి అవకాశమే బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడడం తో ఆ సమయం లో ఆమెను చాలా మంది ఐరన్ లెగ్ అంటూ ప్రస్తావించారు.
దాంతో ఆమె కు మళ్ళీ ఆఫర్లు వస్తాయా రావా అనే అనుమానాలు చాలా మంది వ్యక్తం చేశారు.
కానీ అనూహ్యంగా మెగా హీరో నటించిన రంగ రంగా వైభవంగా సినిమా లో నటించే అవకాశం దక్కించుకుంది.
ఆ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసింది.ఆ సినిమా సక్సెస్ అయితేనే కేతిక శర్మ కి టాలీవుడ్ లో ఒక మంచి హీరోయిన్ గా గుర్తింపు దక్కుతుంది.
ఒక వేళ ఆ సినిమా కనక బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిస్థితి మాత్రం కేతికా శర్మ ఐరన్ లెగ్ బ్రాండ్ ఇమేజ్ అలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అంటూ మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు.వైష్ణవ తేజ్ మొదటి సినిమా సూపర్ హిట్ అయింది కనుక ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.
మీడియం గా ఈ సినిమా ఆడినా కూడా హీరో మరియు హీరోయిన్ కి మంచి పేరును తెచ్చి పెట్టే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.సినిమా లో హీరోయిన్ పాత్ర కి నటించే స్కోప్ ఎక్కువగా ఉంది.
కనుక కేతికా శర్మ ఈ సినిమా ద్వారా నిరూపించుకుంటే టాలీవుడ్ లో రాబోయే ఐదారు సంవత్సరాల పాటు కంటిన్యూ గా ఈమె కు సినిమా లు దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.