పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2వ తారీకు అనే విషయం తెలిసిందే.ఆయన పుట్టిన రోజు సందర్భంగా జల్సా మరియు తమ్ముడు సినిమా లను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు.
జల్సా సినిమా కోసం అభిమానులు పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్ కూడా నమోదు చేశారని సమాచారం అందుతుంది.తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుక లను ఆయన పాత సినిమా లతో భారీ ఎత్తున నిర్వహించేందుకు అభిమానులు ఏర్పాటు చేశారు.
ఆ సినిమా లు స్క్రీనింగ్ అయ్యే థియేటర్ల లో అభిమానులు కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలను జరుపుకోబోతున్నట్లుగా ప్రకటించారు.అయితే కొన్ని ఏరియాల్లో జల్సా సినిమా ని ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబరు ఒకటో తారీకునే రాత్రి షో వేయబోతున్నారు.
అంటే అర్థ రాత్రి సమయం లో పవన్ కళ్యాణ్ సినిమా యొక్క స్క్రీనింగ్ చూసి ఆయన పుట్టిన రోజు వేడుక లను అభిమానులు భారీ ఎత్తున జరుపుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఉంటారనే విషయం తెలిసిందే.ఆయన సినిమా ల్లో ప్రస్తుతం బిజీ గా లేకున్నా కూడా ఆయన అభిమానులు మాత్రం ఆయన సినిమా లను ఆదరించడం అభిమానించడం మానేయరు.గతం లో వచ్చిన జల్సా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందిన ఆ సినిమా లో హీరోయిన్గా ఇలియానా నటించింది.అల్లు అరవింద్ ఆ సినిమా ను నిర్మించాడు.ప్రస్తుతం జల్సా సినిమా యొక్క అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్ లో జరుగుతుంది, ఇదే సమయం లో తమ్ముడు కి కూడా భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది.మొత్తానికి పవన్ కళ్యాణ్ రెండు సినిమా ల స్క్రీనింగ్ ఆయన బర్త్డే సందర్భం గా అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకు రాబోతున్నాయి.
కొన్ని ఏరియాల్లో జల్సా ముందు రోజే విడుదల అవ్వడం వల్ల ఒక రోజు ముందుగానే పండగ పవన్ కళ్యాణ్ అభిమానులకు రాబోతుంది.