యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.రూ.100 కోట్ల వసూళ్లు నమోదు చేసిన కార్తికేయ 2 సినిమా ప్రస్తుతం బాలీవుడ్ లో భారీ షేర్ ని దక్కించుకుంటూ దూసుకు వెళ్తూనే ఉంది.ఇక ఈ సినిమా సౌత్ నుండి బాలీవుడ్ లో విడుదలయ్యి అత్యధిక వసూళ్లు దక్కించుకున్న సినిమాల టాప్ 10 జాబితా లో చోటు సంపాదించింది.ఈ సినిమా రూ.25 కోట్ల వసూలు సాధించడం తో ఆ జాబితా లో చోటు దక్కించుకున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటి వరకు కేవలం కొన్ని సినిమా లు మాత్రమే బాలీవుడ్ లో భారీ వసూళ్ల ను నమోదు చేశాయి.
సౌత్ లో ముఖ్యం గా తెలుగు లో విడుదలైన సినిమా లు ఉత్తర భారతం లో విడుదల అయ్యి చాలా తక్కువ స్థాయి లోనే వసూళ్ల ను నమోదు చేయడం మనం చూస్తూ ఉంటాం.
పాతిక కోట్లు అంతకు మించి వసూళ్లు చేసిన సినిమా లు ఇప్పటి వరకు కేవలం పదే ఉన్నాయి.అందులో నిఖిల్ కార్తికేయ సినిమా నిలిచింది చందు మొన్నటి దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

శ్రీ కృష్ణుడి నేపథ్యం లో రూపొందిన ఈ సినిమా యూత్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతం గా ఆకట్టుకుంటుంది.హిందీ లో ఈ సినిమా అత్యధిక వసూళ్ల ను సొంతం చేసుకున్న నేపథ్యం లో ప్రస్తుతం అక్కడ ట్రెండ్ అవుతూ ఉంది.ఈ సినిమా ను అతి తక్కువ థియేటర్లలో రిలీజ్ చేసి రోజు రోజుకు పెంచుతూనే ఉన్నారు.వీక్ డేస్ లో మరియు వీకెండ్స్ లో ఎప్పుడు కూడా భారీ ఎత్తున ఈ సినిమా వసూళ్లను రాబడుతూనే ఉంది.







