డబ్బుకి ఉన్న విలువ గురించి అందరికీ తెలిసినదే.ఈ క్రమంలో పుట్టిన నానుడి ‘పైసానే పరమాత్మ!’ ఆ డబ్బుకోసం మనుషులు అనేక కష్టాలు పడుతూ వుంటారు.
కొందరు రేయింబవళ్లు చెమటోడ్చి కాయకష్టం చేసి సంపాదిస్తే, మరికొందరు తమ తెలివితో ఎక్కువ డబ్బు సంపాదిస్తుంటారు.ఇంకొందరు ఎలాంటి కష్టము, తెలివి ఉపయోగించకుండానే కోట్ల సంపాదనను ఆర్జిస్తారు.
అలాంటివారి గురించి ఇపుడు మాట్లాడుకోవడం అప్రస్తుతము అనుకోండి.ఇకపోతే నడిరోడ్డుమీద ఎవరికైనా డబ్బులు కనిపిస్తే.
చాలా జాగ్రత్తగా ఎవరూ చూడక మునుపే జేబులో వేసుకుంటారు కదా.
అయితే అసలు రోడ్డుపై మనీ కనిపిస్తే తీసుకోవచ్చా? తీసుకుంటే ఏమైనా ఆపదలు వస్తాయా? అనే అనుమానాలు అనేకమందికి కలుగుతాయి.అయితే మన పెద్దలు రోడ్డుపై డబ్బులు కనిపించినప్పుడు వాటిని తీసుకోక పోవడమే ఉత్తమం అని అంటున్నారు.ఒక వేళ వాటిని మీరు తీసుకున్నట్లయితే వాటిని దేవుని హుండీలో గాని, లేక ఎవరికైనా దానం చేయడమో చేయాలంట.
ఎందుకంటే డబ్బులు పొగొట్టుకున్న వారు, మనీ పోయాయని చాలా బాధ పడుతుంటారు కదా.అందువలన వాటిని మనం తీసుకోవడం వలన వారి బాధ మనకు కలిగే అవకాశం ఉందంట.
సో కాబట్టి దానికి హక్కుదారులు పూర్తిగా వారేకానుక వారి సాధకబాధలు కూడా మనకు తగులుతాయి జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు పండితులు.ముఖ్యంగా కాయకష్టం చేసి సంపాదించిన సొమ్ము మనం తీసుకొని ఖర్చుచేస్తే పాపం చుట్టుకుంటుందంట.
అందువాళ్ల దొరికిన డబ్బును దానం చేయడమో, దేవుని హుండీలో వేయడమో చేయాలి.అలా చేస్తే ఇక ఎలాంటి ముప్పు కలగదట.







