ప్రభాస్ కాపీ క్యాట్ అయ్యాడా.. ఆ విషయంలో జక్కన్నను కాపీ కొట్టాడా?

టాలీవుడ్ దర్శక వీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రాజమౌళి ఒక సినిమాను తెరకెక్కించడానికి సంవత్సరాల పాటు సమయం తీసుకున్న కూడా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించే విధంగా రూపొందిస్తూ ఉంటాడు.

 Did Prabhas Copy Rajamouli Formula Details, Prabhas, Rajamouli, Tollywood, Think-TeluguStop.com

అయితే రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడట.అదేమిటంటే పాన్ ఇండియా సినిమా తర్వాత రిలీఫ్ కోసం అదేవిధంగా రిలాక్స్ గా పని చేయడం కోసం ఒక చిన్న సినిమాను తెరకెక్కించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా రాజమౌళి ఇంతకుముందే మగధీర లాంటి భారీ సినిమాను తెరకెక్కించిన తరువాత మర్యాద రామన్న లాంటి చిన్న సినిమాను తెరకెక్కించి మంచి సూపర్ హిట్ టాక్ ను అందుకున్న విషయం తెలిసిందే.

అనంతరం నానితో కలిసి ఈగ సినిమా చేసిన తర్వాత కూడా ఇదేవిధంగా మంచి హిట్ టాక్ ను అందుకున్నాడు.

కాగా ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రాజమౌళి ప్రస్తుతం ఒక చిన్న సినిమాలు తనికెక్కించడం కోసం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.అయితే మహేష్ బాబుతో కలిసి పాన్ ఇండియా సినిమా తెరకెక్కించక ముందే ఒక చిన్న సినిమా రూపొందించాలి అన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే రాజమౌళి తరహా లోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న ప్రభాస్ కాస్త రిలీఫ్ కోసం ఒక చిన్న సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Telugu Copy, Maruthi, Eega, Magadheera, Prabhas, Raja Deluxe, Rajamouli, Tollywo

దర్శకుడు మారుతీ దర్శకత్వంలో హారర్ కామెడీ ప్రయత్నాలు చేస్తున్నారట.ఇదే విషయాన్ని స్వయంగా ప్రభాస్ తెలిపారు.అయితే ఈ సినిమా రాజా డీలక్స్ అనే పాత థియేటర్ చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కనుందట.అలాగే ఇది తాత మనవడు కథ అని తెలుస్తోంది.హీరో పూర్వీకుల ఆస్తి చుట్టూ ఈ సినిమా మొత్తం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.కాగా ఇప్పటికే ఈ సినిమాకోసం ఇప్పటికే రామోజీ ఫిల్మ్సిటీలో భారీ థియేటర్ కూడా సెట్ వేశారట.

ప్రభాస్ హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభం కావచ్చని సమాచారం.ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా మాళవిక మోహనన్ నటిస్తోందట.

మరి ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే మరి కొద్దిరోజులు వేసి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube