భారతదేశంలో ఫైటింగ్ గేమ్స్ అంటే చాలా ఇష్టపడతారు.కిక్ బాక్సింగ్, WWE, మార్షల్ ఆర్ట్స్ వంటి ఫైటింగ్ గేమ్స్ మన అందరికీ తెలిసినవే.
కానీ ఇటీవల లైగర్ సినిమా చూశారు కదా దాంట్లో విజయ్ దేవరకొండ MMA అనే ఒక ఆట ఆడాలనుకుంటాడు దాంట్లో వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవాలని ఆరాటపడుతూ ఉంటాడు.అనూహ్యంగా సినిమా ఫ్లాప్ అయినప్పటికీ విజయ్ దేవరకొండ ఆడిన ఈ గేమ్ పై అనేకమందికి ఇంట్రెస్ట్ కలుగుతుంది.
ఈ గేమ్ కు సంబంధించి మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి.
MMA అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్… ఇది ఒక హైబ్రిడ్ ఫైట్ గా పేరు సంపాదించుకుంది.
రెజ్లింగ్, జూడో, కరాటే, బాక్సింగ్, థాయ్ బాక్సింగ్ వంటి క్రీడలను కలిపి హైబ్రిడ్ గేమ్ గా ఈ ఆటను రూపొందించారు.తొలిదాలలో ఇది ఒక క్రూరమైన ఆటగా పరిగణింపబడింది ఎందుకంటే దీనికి ఎలాంటి రూల్స్ లేకపోవడంతో ఎక్కువ మంది మరణించడం వంటివి జరిగాయి.
కానీ రూపాంతరం చెందిన ఈ ఆట ప్రస్తుతం మార్పులు చేర్పులకు గురై ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షిస్తున్న ఆటల్లో ఒకటిగా స్థానం సంపాదించుకుంది.
బ్రెజిల్ లోని వాలే ట్యుడో ద్వారా 20వ శతాబ్దపు ప్రారంభంలో ఈ ఆట వెలుగులోకి వచ్చింది.

ఆ తర్వాత నార్త్ అమెరికాలో ఇద్దరు అన్నదమ్ములైన కార్ల్, హెలియో అనే సోదరులు ఈ ఆటకు బాగా ప్రాచుర్యం కల్పించారు.యు ఎఫ్ సి అల్టిమేట్ చాంపియన్షిప్ అనే పేరుతో ఈ ఆటను కార్ల్, హెలీయో బ్రదర్స్ ఫైటింగ్ చాంపియన్షిప్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చారు.అయితే ఈ అటకు ప్రస్తుతం కఠినమైన నిబంధనలు ఉన్నాయి.తొలినాళ్ళలో ఎలాంటి నియమాలు లేని ఈ ఆట ప్రస్తుతం అనేక నిబంధనల మధ్య కొనసాగుతుంది.ఈ ఆటను ఐదు నిమిషాల చొప్పున మూడు రౌండ్స్ ఆడాలి.ప్రతి రౌండ్ కి ఒక నిమిషం చొప్పున విశ్రాంతి ఉంటుంది ఐదు రౌండ్లలో నాకౌట్ చేసి విజయం సాధించాల్సి ఉంటుంది.








