కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది.దీనిలో భాగంగా యానాదిపల్లిలో ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.
ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.ఏపీలో పాలనను చూస్తుంటే ఉత్తర కొరియా గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు.
టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడటమే కాకుండా.తిరిగి వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.
కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులకు వైసీపీ శ్రేణులే కారణమని ఆరోపించారు.పోలీసులు సైతం రౌడీల్లా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదివరకు కుప్పం నియోజకవర్గంలో చిన్న గొడవ కూడా జరగలేదన్న ఆయన.వేరే ప్రాంతాల నుంచి రౌడీలను తీసుకువచ్చి ఘర్షణలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.







