ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ మాగంటి బాబు ఇటీవల నూజివీడులో టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో వచ్చే ఎన్నికలలో ఏలూరు పార్లమెంటు సభ్యుడిగా టీడీపీ నుండే పోటీ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
అభ్యర్థి తానే అని చెప్పుకొచ్చారు.ఈ విషయంలో చంద్రబాబు నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని అన్నారు.
ప్రతి ఒక్కరూ తన గెలుపునకు కృషి చేయాలని.తాను నియోజకవర్గానికి, జిల్లాకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే గత కొంత కాలం నుండి మాగంటి బాబు చాలా వరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.ఇద్దరు కుమారులు మరణించడంతో మొన్నటివరకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మాగంటి బాబు ఇప్పుడు తాజాగా మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతూ.వచ్చే ఎన్నికలలో టీడీపీ ఎంపీగా తానే నిలబడుతున్నట్లు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. 2014 ఎన్నికలలో ఏలూరు ఎంపీగా గెలిచిన మాగంటి బాబు తర్వాత 2019 ఎన్నికలలో ఓడిపోయారు.ఈ క్రమంలో మళ్లీ వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఎంపీగా తానే మళ్ళీ పోటీ చేస్తున్నట్లు తెలిపారు.







