టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట కెరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొద్దిరోజుల పాటు వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో అవకాశాలు తక్కువ కావడంతో బాలీవుడ్ కి చెక్కేసింది.అక్కడ టాప్ హీరోల సరసన నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్.
కాగా ఈమె కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికి సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.అంతేకాకుండా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి అప్పుడప్పుడు టూరిజం ప్లేస్ ను సందర్శిస్తూ ఉంటుంది.
రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత అయిన జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా నటించిన చిత్రం కట్ పుత్లీ.
ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.కాగా ఈ సినిమా సెప్టెంబర్ రెండవ తేదీన హోట్ స్టార్ లో ప్రసారం కానుంది.
ఈ నేపథ్యంలోనే విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఈ ట్రైలర్ కు మంచి స్పందన లభించింది.ఒకవైపు ప్రమోషన్స్ లో పాల్గొంటూనే మరొకవైపు ఇంస్టాగ్రామ్ లో హాట్ ఫోటో షూట్లతో సెగలు కక్కిస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా బ్లాక్ డ్రెస్, సిల్వర్ కలర్ చెవిపోగులతో సింప్లీ సూపర్ అనే విధంగా హాట్ ఫోటో లకు ఫోజులు ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.
ఈ ఫోటోపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇది ఇలా ఉంటే ఇంకొంతమంది రగులు ధరించిన ఆ డ్రస్ ఖరీదు ఎంత అని ఆరా తీయగా.రకుల్ ధరించిన ఆ డ్రెస్ ధర అక్షరాల 38వేల రూపాయలు అని తెలిసింది.ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఎటువంటి సినిమాలు చేయకపోయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.