రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా ను బాలీవుడ్ లో కరణ్ జోహార్ సమర్పిస్తున్నాడు.
అక్కడ భారీ అంచనాల నడుమ లైగర్ సినిమా నేడు విడుదల అయ్యింది.ఈ మధ్య కాలం లో సౌత్ సినిమా లు మరీ ముఖ్యంగా తెలుగు సినిమా లు బాలీవుడ్ లో అదరగొడుతున్నాయి.
కేవలం 20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కార్తికేయ 2 సినిమా హిందీ లో సాధిస్తున్న వసూళ్ల గురించి మొత్తం ఆశ్చర్యంగా చూస్తున్నారు. కార్తికేయ 2 లాంగ్ రన్ లో మినిమంగా పాతిక కోట్ల వరకు వసూళ్లు సాధించే అవకాశం ఉంది అంటున్నారు.
ఇప్పుడు లైగర్ సినిమాకు అక్కడ పాజిటివ్ రెస్పాన్స్ వస్తే తప్పకుండా వంద కోట్ల వరకు వసూళ్లు సాధించే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం సినిమా కు చెందిన వసూళ్ల లెక్కల కోసం జనాలు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరి కొన్ని గంటల్లో సినిమా యొక్క ఫుల్ రిపోర్ట్ క్లారిటీ గా ప్రేక్షకుల ముందుకు సోషల్ మీడియా ద్వారా వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బాలీవుడ్ తో పాటు ప్రతి ఒక్క భాష లో కూడా లైగర్ సినిమా కుమ్మేస్తుందనే నమ్మకం ను ఇండస్ట్రీ వర్గాల మరియు యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ లో లైగర్ సినిమా కనుక సూపర్ హిట్ అయ్యి భారీ వసూళ్లను దక్కించుకుంటే అప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సిగ్గు తో తల దించుకుంటారేమో అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.ఎందుకంటే ఇటీవల అక్కడ విడుదల అయిన సినిమా లు అత్యంత దారుణంగా డిజాస్టర్స్ గా నిలిచిన విషయం తెల్సిందే.







