దేశంలో అరాచక కొనసాగుతుందని దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని బిజెపి సర్కార్ ఇతర పార్టీల నేతలను భయంభ్రాంతులకు గురి చేస్తుందని టిఆర్ఎస్ ఆరోపించింది.జై మోడీ అంటే జై ఈడీ అనే పరిస్థితి కొనసాగుతుందని ధ్వజమెత్తింది.
మోడీకి లొంగిపోతే కేసులు మాఫీ అవుతాయని, ఎదిరిస్తే సిబిఐ, ఈడి, ఐటి సంస్థలు దాడులు చేస్తాయని విమర్శించింది.కేంద్రంలోని బిజెపి సర్కార్ పై తీవ్రస్థాయిలో టిఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు.
సిబిఐ, ఈడి బిజెపి చేరికల కమిటీలుగా మారాయని ఆరోపించారు.ప్రధాని మోడీ ఈడి ఇజం అమిత్ షా ఐటీ యీజానికి ఎవరూ భయపడరని, ఇలాంటి నియంతలు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారని మోడీకి అదే జరుగుతుందని టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
జాతీయస్థాయిలో ఎదుగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా లేకనే బిజెపి నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని టిఆర్ఎస్ నేతలు విమర్శించారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ బిజెపి పార్టీ అనుబంధ విభాగాలుగా మారాయి అని అన్నారు.సింధియా, హేమంత్ విశ్వశర్మ బిజెపిలో చేరగానే వారిపై ఉన్న ఈడీ విచారణ ఆగిపోయిందని ఎలా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.సిబిఐ ప్రస్తుతం సెంట్రల్ బిజెపి ఇన్వెస్టిగేషన్ గా మారిందని చెబుతున్నారు.
కాసులకు, తప్పుడు కేసులకు టిఆర్ఎస్ లొంగిపోద్దని .కెసిఆర్ కు రాజీపడే మనస్తత్వం ఉంటే తెలంగాణ వచ్చేది కాదని చెబుతున్నారు.బిజెపి పార్టీ మోసాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నిస్తుంటే .ప్రధాని మోడీ అమిత్ షాకు వణుకు పుడుతుందన్నారు.సీఎం కేసీఆర్ ను ఎదుర్కోలేకనే ఎమ్మెల్సీ కవితపై బిజెపి పార్టీ నిరాధార ఆరోపణలు చేస్తుందని టిఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.కెసిఆర్ ను మానసికంగా గురి చేసేందుకు బిజెపి నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
కెసిఆర్ ను అరెస్టు చేస్తామని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పదేపదే అంటున్నారని ఆయన తాకితే తెలంగాణ అగ్నిగోళంగా మారుతుందని టిఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు.

బిజెపి నేతలు కయ్యం పెట్టుకోవడం తగదని టిఆర్ఎస్ నేతలు హితువు పలికారు.నిరాధార ఆరోపణలు చేయడమే కాకుండా కవిత ఇంటిపై ఆ పార్టీ గూండాలు దాడికి పాల్పడడాన్ని ఖండిస్తున్నామని .బిజెపి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.రాష్ట్రంలో టిఆర్ఎస్కు 60 లక్షల సైన్యం ఉందని, తాము తలుచుకుంటే బిజెపి నాయకులు ఇంట్లో నుంచి బయటకు రాలేరని హెచ్చరిస్తున్నారు.ఆత్మగౌరవం కోసం సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో అమిత్ షా బూట్లు మోసి బిజెపి అధ్యక్షుడు బానిసత్వాని ప్రదర్శించారన్నారు.
బిజెపి నేతల గుండా గిరిని సహించబోమని ప్రజా వ్యతిరేక విధానాలపై వారితో కొట్లాడుతామని టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేయడం బిజెపి నేతలు దిగజారుడు స్థానానికి నిదర్శనం అని మంత్రి సత్యవతి అంటున్నారు.