సుకుమార్‌, రాజమౌళి కూడా పూరిని అభిమానిస్తారు.. ఎందుకు?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ దర్శకత్వం లో రూపొందిన లైగర్ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది.భారీ అంచనాల నడుమ రూపొందిన లైగర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో దర్శకుడు పూరి జోరుగా పాల్గొంటున్నాడు.

 Rajamouli And Sukumar Also Fans Of Liger Movie Director Puri Jaganath , Film Ne-TeluguStop.com

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడిస్తున్నాడు.తాజాగా ఆయన సోషల్ మీడియాకు దూరం అయ్యి వరుసగా బాలీవుడ్‌ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడట.

ఇప్పటికే మూడు నాలుగు సినిమా లకు అక్కడ సైన్‌ చేశాడు.వచ్చే రెండేళ్లలో బాలీవుడ్‌ లో పూరి మూడు నుండి నాలుగు సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.

ఇంత స్పీడ్ మరే దర్శకుడికి కూడా సాధ్యం కాదు.అందుకే రాజమౌళి తో పాటు దర్శకుడు సుకుమార్‌ కి కూడా దర్శకుడు పూరి జగన్నాథ్ అంటే చాలా ఇష్టం.

వీరిద్దరికి మాత్రమే కాకుండా ఎంపీ.ప్రముఖ రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్‌ కి కూడా పూరి జగన్నాథ్ అంటే విపరీతమైన అభిమానం.

ఏకంగా తన మొబైల్‌ ఫోన్ లో స్క్రీన్‌ సేవర్‌ గా పూరి జగన్నాథ్ కి ఫ్యాన్ ను అంటూ చెప్పుకొచ్చాడు.తాను పూరిని ఎంతగా అభిమానిస్తానో చెప్పలేను అన్నట్లుగా విజయేంద్ర ప్రసాద్‌ చెప్పుకొచ్చాడు.

ఇక సుకుమార్‌ కూడా పూరిని అభిమానిస్తున్నాడు.తాజాగా లైగర్‌ సినిమా ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలో భాగంగా పూరి జగన్నాథ్ ను సుకుమార్‌ ఇంటర్వ్యూ చేశాడు.

ఆ ఇంటర్వ్యూ రివీల్‌ అయ్యింది.ఇంటర్వ్యూలో పలు సందర్బాల్లో సుకుమార్‌ మాట్లాడుతూ పూరి ని ఆకాశానికి ఎత్తేశాడు.

గతంలో రాజమౌళి కూడా పూరి జగన్నాథ్ సినిమా నలు చాలా స్పీడ్ గా చేస్తాడు.ఆయన్ను చూసి అయినా నేను సినిమా లను మేకింగ్‌ విషయంలో ఫస్ట్‌ గా ముగించే ప్రయత్నం చేయాలి అనుకుంటున్నాను అంటూ రాజమౌళి అన్నాడు.

అలాంటి గొప్ప దర్శకుల వద్ద గొప్ప కామెంట్స్ ను పొందిన పూరి జగన్నాథ్‌ నిజంగా గ్రేట్‌ అనడంలో సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube