అమిత్ షా, ఎన్టీఆర్ భేటీ వెనుక అసలు ప్లాన్ ఇదే.. మరీ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటో!

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేశ రాజకీయాలను శాసిస్తున్న భేటీ అవ్వడం ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

అలాగే రాజకీయాలలో కూడా ఇదే హాట్ టాపిక్ గా మారింది.

ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించే చర్చలు వినిపిస్తున్నాయి.ఆర్ఆర్ఆర్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు.

అందువల్లే అభినందనలలో భాగంగా అమిత్ షా ఎన్టీఆర్ కలిశారు అని బండి సంజయ్ లాంటి వారు చెబుతున్నారు.ఎన్టీఆర్ సినిమా విడుదల కాకముందు సినిమా రీళ్లు తగలబెట్టేస్తాం అని నానా హంగామా చేసిన హెచ్చరికలు జారీ చేసిన బీజేపి లీడర్ బండి సంజయ్.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాని పొగడ్డానికే మా బాస్ వచ్చారని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.మరి అమిత్ షాని ఎన్టీఆర్ ఎందుకు కలిశాడు? రాజకీయపరంగా కలిసాడ?లేదంటే సినిమాల పరంగా కలిశాడా అన్నది ఆ టాపిక్ గా మారింది. అమిత్ షా,ఎన్టీఆర్ ఇద్దరూ హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు.

Advertisement

ఆర్ఆర్ఆర్ విజయోత్సవంలో భాగంగానే అమిత్ షా ఎన్టీఆర్‌ని కలిశారని పైకి చెప్తున్నాడు.ఒకవేళ అదే వార్త నిజం అయితే ఆ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా నటించాడు కదా, అంతటి గొప్ప సినిమాను తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళికి ఆహ్వానం అందలేదు ఎందుకు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒకవేళ రాబోయే ఎన్నికలలో బీజేపీ అస్త్రంగా ఉపయోగించుకోవడానికే ఈ భేటీ అయ్యి ఉంటుందా అంటే,ఇప్పట్లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం లేదు.ఎందుకంటే ఎన్టీఆర్‌కి ఇప్పుడు ఫుల్‌గా సినిమాలు ఉన్నాయి.అంతే కాకుండా వచ్చే ఐదేళ్లవరకూ ఫుల్ బిజీ షెడ్యూల్ ఉంది.

అలాగే తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీని పార్టీని కాకుండా,బీజేపీకి ఎన్టీఆర్ ప్రచారం చేసే అవకాశం అయితే లేదనే చెప్పాలి.కాగా మరోవైపు పవన్ జనసేన పార్టీ పెట్టినప్పటికీ ఆయన కూడా బీజేపీ రూట్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నారు.

అంటే బీజేపీ రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్ అనేట్టుగానే ఉంది పరిస్థితి.కానీ వచ్చే ఎన్నికల నాటికి ఇదే పరిస్థితి ఉంటుందంటే చెప్పలేం.ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఎన్టీఆర్‌ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ కూడా మొదలైంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

అలాగే పవన్ కళ్యాణ్ మద్దతు విషయంలో మనసు మార్చుకుంటే తమకి రాజకీయ అస్త్రంగా ఉపయోగపడతాడనే వ్యూహంలో భాగంగానే అమిత్ షా ఎన్టీఆర్‌ని కలిసి ఉంటారని 2029 ఎన్నికల్ని టార్గెట్ చేసి ఎన్టీఆర్‌‌తో అమిత్ షా భేటీ జరిగి ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Advertisement

తాజా వార్తలు