ఇక నుంచి ఆరుబయట కూడా కూల్ కూల్.. సరికొత్త ఏసీ ఆవిష్కరించిన ఇజ్రాయెల్!

వాతావరణం చాలా మారిపోతోంది.ప్రతియేటా వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

 Israel Green Kinoko Kensho Out Door Ac Units Details, Israil, New Ac, Technology-TeluguStop.com

ముఖ్యంగా వేసవి కాలం అధిక తాపంతో ప్రజలను ఏపుకు తింటోంది.పట్ణణ ప్రజలైనా, పల్లెవాసులైనా ఇపుడు తమ ఇళ్లల్లో ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారు.

అయితే ఏసీ వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడటంతో పాటు బోలెడంత కరెంట్ బిల్లు కూడా వస్తుంది.ఇక ఈ ఏసీ అనేది నేడు మనం కేవలం క్లోజ్‌డ్ సర్ఫేస్‌లో మాత్రమే ఏర్పాటుచేసుకొనే వెసులుబాటు కలదు.

ఆరుబయట, ఇలాంటివి ఏర్పాటుచేసుకొనే అవకాశం దాదాపుగా లేదనే చెప్పుకోవాలి.

అయితే ఇపుడు అలాంటి రిస్ట్రిక్షన్స్ కి చెక్ పెడుతూ ఓ వార్త వైరల్ అవుతోంది.అవును… అసలు విద్యుత్ అవసరమే లేకుండా, ఆరుబయట ఏసీ పెట్టుకుని కూల్‌గా వాతావరణాన్ని మార్చవచ్చు.ఈ మేరకు ఇజ్రాయెల్‌ కంపెనీ ‘గ్రీన్ కినోకో’.‘కెన్షో’ పేరుతో ఓ వినూత్న ఏసీని డెవలప్ చేసింది.లిక్విడ్ నైట్రోజన్ ఆధారంగా పనిచేసే ఏసీలోని ప్రామాణిక ట్యాంకులు ద్రవ నత్రజనిని 196 °C (-321 °F) వద్ద ఫ్రీజ్ చేసి, ఏసీని ఆన్ చేయగానే ద్రవం నెమ్మదిగా కూలర్‌లలోకి లోడ్ అవుతుంది.

అప్పుడది వాయువుగా మారిన క్షణంలో దాదాపు 700 రెట్లు వేగంగా విస్తరిస్తుంది.

Telugu Cool, Green Kinoko, Israel, Israil, Kensho Ac, Ac, Door Ac Units, Ups-Lat

కూలర్లు ఆ ద్రవపరిమాణాన్ని 10 °C (14 °F) ఉష్ణోగ్రతతో బయటకు పంపడంతో ఆ పరిసర ప్రాంతం పూర్తిగా చల్లబడుతుంది.ఔట్‌డోర్ హీటర్‌తో సమానమైన మోడల్‌లో పనిచేసే AC యూనిట్‌లకు ప్రత్యామ్నాయంగా వీటిని రూపొందించగా.బయట ఉన్న వేడి, పరిసరాల ఆధారంగా లిక్విడ్ నైట్రోజన్ ట్యాంకులను ప్రతీ 7-10 రోజులకు మార్చవలసి ఉంటుంది.

కాగా పైలట్ ట్రయల్స్‌ కోసం కంపెనీ 12 నమూనా యూనిట్లను నిర్మించింది.ఇప్పటికే 40 దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.కానీ 2023 చివరి వరకు మార్కెట్‌‌లోకి విడుదల చేస్తాం.మా ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు పెట్టుబడి కోసం చూస్తున్నాము.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube