ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది మూర్ముతో భేటీ కావడం జరిగింది.
ఇక ఇదే సందర్భంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కే సింగ్ తో కూడా సమావేశమయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన విద్యుత్ బకాయిలపై చర్చించారు.తెలంగాణ భారీగా విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందని .ఈ వివాదం సోలి సీటర్ జనరల్ వద్ద ఉందని బకాయిలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి ఏపీ ముఖ్యమంత్రి కి చెప్పినట్లు సమాచారం.
ఇక ఇదే సందర్భంలో బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం తెలంగాణ కోల్పోతుందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ఏపీ సీఎం జగన్ కి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
సుమారు అరగంట పాటు వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం.ప్రధాని మోడీతో భేటీ అయిన క్రమంలో పోలవరం నిధులు ఆలస్యం అవకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు.
అంతేకాదు పోలవరం నిర్వాసితుల పునరావస ప్యాకేజీ త్వరితగితన ఇవ్వాలని కోరారు.