తీజ్ ఉత్సవాల్లో తెలంగాణ గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.దీనిలో భాగంగా గిరిజనులతో కలిసి నృత్యాల్లో ఉత్సాహంగా పాలు పంచుకున్నారు.
గిరిజనులు ఉత్సాహంగా జరుపుకునే తీజ్ ఉత్సవాలను పురస్కరించుకుని.నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం జయప్రకాశ్ నగర్ తండాలోఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ ఉత్సవాలకు హాజరైన సత్యవతి రాథోడ్.గిరిజనులతో కలిసి ఆడిపాడారు.
గిరిజన సంప్రదాయ వస్త్రాన్ని తలపై ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.







