తెలంగాణ వ్యాప్తంగా సుమారు ఏడువందల ఎకరాలకు పైగా ఉన్న గుట్ట ప్రాంతంలో మైనింగ్ చేసేందుకు టీఎస్ఎండీసీ రంగం సిద్ధం చేస్తోంది.గుట్టలను, కొండలను రాతి ఇసుక, కంకరగా మార్చి విక్రయాలు సాగించనుంది.
దీనిలో భాగంగా యాచారంలోని క్వారీకి పర్యావరణ అనుమతులు లభించాయి.బండరావిర్యాలలో ప్రజాభిప్రాయ సేకరణ దశలో ఉండగా.
దండు మైలారం, చిన్నరావిర్యాలలోనూ తవ్వకాలకు ప్రణాళికలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ సహా నగర శివారు ప్రాంతాలలో రాతి ఇసుకకు గిరాకీ ఎక్కువ.
నది ఇసుకతో పోలిస్తే ధర తక్కువగా ఉండటంతో భారీ నిర్మాణాల్లో ఎక్కువగా దీన్నే వినియోగిస్తుంటారు.ఈ క్రమంలో ఆదాయ వనరులను పెంచుకునే దిశగా టీఎస్ఎండీసీ మైనింగ్ పై దృష్టి సారించింది.
దీనిలో భాగంగా రంగారెడ్డి రెడ్డి జిల్లా బండరావిర్యాల, యాచారం, దండుమైలారం, చిన్నరావిర్యాలలో గుట్ట ప్రాంతాలను గుర్తించి, మైనింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.







