మీరు లేకుంటే షో బాగుంది.. పూర్ణపై దారుణమైన సెటైర్లు.. పంచులు?

తెలుగు బుల్లితెర పేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పూర్ణ ప్రస్తుతం బుల్లితెర పై ప్రసారమయ్యే పలు షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తూనే మరోవైపు వెండితెరపై అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.

 Hyper Adi Auto Ram Prasad Satires On Poorna In Sridevi Drama Company Details, H-TeluguStop.com

ఢీ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి కూడా జడ్జిగా వ్యవహరిస్తూ స్కిట్ మధ్యలో తనదైన శైలిలో పంచులు వేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది.

ఇకపోతే పూర్ణ కు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందొ మనందరికీ తెలిసిందే.అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో అందాల కనివిందు చేస్తూ ఉంటుంది.

అంతేకాకుండా చీరకట్టులో కూడా తన అందాలను చూపిస్తూ కుర్రకారుని రెచ్చగొడుతూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే పూర్ణ ఇటీవల ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.ఇక త్వరలోనే ఈమె పెళ్లి పీటలు ఎక్కబోతోంది.అయితే ఎంగేజ్మెంట్ అయిన విషయం ఎవరికీ చెప్పకుండా ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చింది.

అయితే పూర్ణ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే, మరొకవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ, అలాగే వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ దూసుకుపోతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా మళ్లీ శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎంట్రీ ఇచ్చిన పూర్ణకు చేదు అనుభవం ఎదురైంది.

Telugu Auto Ram Prasad, Hyper Aadi, Hyper Adi, Poorna, Poornasridevi, Sridevidra

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి సంబంధించిన ప్రోమోనీ విడుదల చేసారు.ఆ ప్రోమోనీ బట్టి చూస్తే పూర్ణ మళ్ళి రీఎంట్రీ ఇచ్చింది.అయితే పూర్ణ రెండు మూడు ఎపిసోడ్ రాకపోవడంతో ప్రగతి,ఇంద్రజ లు వచ్చి ఆ ప్లేస్ ని భర్తీ చేశారు.కాగా తాజాగా మళ్లీ రీఎంట్రీ ఇవ్వడంపై హైపర్ ఆది, రామ్ ప్రసాద్ లు సెటైర్లు వేశారు.

ఏంటి నాలుగు ఎపిసోడ్‌లకు గ్యాప్ ఇచ్చారు అని ఆది అనగా.వెంటనే రామ్ ప్రసాద్.మీరు చూడలేదా? మీరు లేనప్పుడే షో బాగుంది.ఆ గ్యాప్‌ను కంటిన్యూ చేస్తే బాగుండేది కదా? అంటూ ఆటో నోరు జారాడు.దీంతో పూర్ణ మోచేత్తో రాం ప్రసాద్‌ కడుపులో ఒక్కటిస్తుంది.అయితే మరి ఆ డైలాగ్ పూర్ణ సీరియస్ గా తీసుకుంటుందా లేదంటే సిల్లీగా తీసుకుంటుందా.ఇకపై అయినా పూర్ణ కంటిన్యూ అవుతుందా లేదంటే మళ్లీ గ్యాప్ ఇస్తుందా ఈ విషయాలు తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube