Independence Day Special: దేశ భక్తి చాటుకున్న ఓ కళాకారుడు.. వీడియో వైరల్!

మరొక మూడు రోజుల్లో మన మాతృభూమి స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎందరో మహానీయులను తలుచుకుంటాం.దేశభక్తి అనేది ప్రతి భారతీయుడి నరనరాల్లో ఇమిడి ఉంటుంది.

 Tamilnadu Miniature Artist Paints India National Flag In Eyes-TeluguStop.com

బ్రిటిష్ చేరనుంది భారత దేశాన్ని కాపాడటానికి ఎందరో మహనీయులు సమిధలుగా మారారు.స్వాతంత్ర్యానికి ముందు మన దేశంలో మనం బానిసలుగా బతికామన్న సంగతి అందరికీ విదితమే.

ఎందరో త్యాగ ఫలం కారణంగా మనం ఇప్పుడు స్వేశ్చని అనుభవిస్తున్నాము.ఈ క్రమంలో భారత దేశం పై గల ప్రేమను ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఛాటుకుంటూన్నారు.

తాజాగా ఓ కళాకారుడు అద్బుతాన్ని చేశాడు.తమిళనాడుకు చెందిన ఓ సూక్ష్మ కళాకారుడు తన దేశభక్తిని చాటుకోవడానికి కంటిలో జాతీయ జెండా పెయింటింగ్​ వేసుకొని అందరినీ అబ్బురపరిచాడు.

వైద్యులు వద్దని చెప్పినా కూడా వినకుండా పెద్ద సాహసమే చేశాడు.తమిళనాడు, కోయంబత్తూరులోని కునియముతుర్​కు చెందిన USD రాజా అనే సూక్ష్మ కళాకారుడు దేశభక్తిని ఇలా వినూత్నంగా చాటుకున్నాడు.

కంటిలో జాతీయ జెండాను తీర్చిదిద్దేందుకు ఎనామిల్ పెయింట్​ను వాడాడు.

రాజా స్వతహాగా స్వర్ణకారుడు.సూక్ష్మ కళా చిత్రాలను రూపొందించడంతో అతడిది అందెవేసిన చేయి.దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ వినూత్న కళకు శ్రీకారం చుట్టాడు.

ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రకరకాలుగా పెయింటింగ్స్‌ గీస్తాడు.ఈ సంవత్సరం దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి ప్రజలకు ఓ అరుదైన కళాఖండాన్ని అందించాలని అనుకున్నాడు.

అప్పుడే తన స్కూల్లో చదివిన ‘జాతీయ జెండాను కంటికి రెప్పలా కాపాడుకుంటాం’ అనే నినాదం గుర్తుకొచ్చింది.అలా జాతీయ జెండాను కంటిలో రూపొందించాలని అనుకున్నాడు.

అదే చేసి చూపించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube