‘గణేష్,వర్ష బొల్లమ్మ' ల "స్వాతిముత్యం" అక్టోబర్ 5 న విడుదల

‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’.‘వర్ష బొల్లమ్మ’ ఈ చిత్ర కధానాయిక.

 Swathi Muthyam, A Family Entertainer With A Novel Plot, Set To Release On Octobe-TeluguStop.com

లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.కంటెంట్ బలంతో దసరా శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి విడుదల తేదీ ఖరారు చేస్తూ ప్రచార చిత్రం ఈరోజు విడుదల చేశారు.”స్వాతిముత్యం” అక్టోబర్ 5 న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ అధికారికంగా ప్రకటించారు.

‘స్వాతిముత్యం’ లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం.

జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల,ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం.కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి.ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి.సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి.

ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రం’స్వాతిముత్యం’.సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా ‘స్వాతిముత్యం’ ను దర్శకుడు తీర్చి దిద్దారు లక్ష్మణ్ అని తెలిపారు

చిత్ర ప్రచారం కూడా సగటు సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకుంటూ, ఆసక్తిని కలిగిస్తోంది.

ఇటీవల విడుదల అయిన “నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా” గీతం తో పాటు ఇప్పటివరకు చిత్రానికి సంబంధించి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో చిత్రం సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి అన్న వార్తలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి అంటోంది చిత్ర బృందం.

గణేష్ ,వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు.

సాంకేతిక వర్గం:

సంగీతం: మహతి స్వర సాగర్, సినిమాటోగ్రఫీ: సూర్య , ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్ల, పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్ సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, రచన, దర్శకత్వం: లక్ష్మణ్ కె.కృష్ణ

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube