సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటి నుంచి ఇండస్ట్రీకి చెందిన నటీనటులను, సినిమాలను బాగా ట్రోల్స్ చేస్తున్నారు ట్రోలర్స్.ఏదో ఒక విషయంలో నటీనటులపై, సినిమాలపై మీమ్స్ క్రియేట్ చేసి బాగా వైరల్ గా మారుస్తూ ఉంటారు.
నిజానికి ఎప్పుడెప్పుడు వారిపై ట్రోల్స్ వేద్దామా అని ఎదురు చూస్తుంటారు.అంతేకాకుండా వారు నటించిన సినిమాలలో ఏదైనా పొరపాటు కనిపిస్తే చాలు వెంటనే దానిని ట్రోల్ చేస్తుంటారు.
కొన్ని కొన్ని సార్లు హీరోయిన్ల బాడీ షేమింగ్ పై, హీరోల లుక్ లపై కూడా కామెంట్లు, ట్రోల్స్ చేస్తుంటారు.నిజానికి ఈ ట్రోల్ చేసేవాళ్లు.ఎవరో ఉండరు.ఎవరైతే ఆ హీరోకి వ్యతిరేకంగా ఉంటారో వాళ్లే ఈ ట్రోల్స్ చేసి బాగా వైరల్ చేస్తుంటారు.
ఇక కొన్ని కొన్ని సార్లు వెబ్సైట్ వాళ్ళని, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని కూడా బాగా ట్రోల్ చేస్తుంటారు ట్రోలర్స్.
ఎప్పుడైనా వాళ్లు పొరపాటున ఏదైనా వార్తను వైరల్ గా మారిస్తే వెంటనే ట్రోల్స్ కు గురి అవుతుంటారు.
అలా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా బాగా ట్రోల్స్ కి గురైంది.ఇంతకూ అసలు విషయం ఏంటంటే.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు నిన్న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

ఇక ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు.థియేటర్లో మరోసారి పోకిరి సినిమాను వేయించారు.ఇక ఈ సినిమా 2006లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఎంత సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే.
మహేష్ బాబు, ఇలియానా కలిసి జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సొంతం చేసుకొని రికార్డుకెక్కింది.

ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సాయాజీ షిండే, బ్రహ్మానందం, ఆలీ, నాజర్ వంటి పలువురు నటీ నటులు నటించారు.ఈ సినిమాలోని డైలాగులు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.ఇందులో పాటలు కూడా ఎంతో మంచి సక్సెస్ ను అందుకున్నాయి.
ఇక ఈ సినిమా తెలుగులో హిట్ అవడంతో ఇతర భాషలలో కూడా రీమేక్ గా విడుదలై మంచి సక్సెస్ అందుకుంది.ఇప్పటికీ కూడా ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
అలా నిన్న ఈ సినిమా విడుదల చేయటంతో జోరు ఎత్తున ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షించారు.యూట్యూబ్లో ఈ సినిమా గురించి రివ్యూ కూడా ఇచ్చారు.
ఓ యూట్యూబ్ ఛానల్ ఈ సినిమా గురించి సోది లేకుండా హిట్టో.ఫట్టో అని తంబ్ నెయిల్ పెట్టడంతో దానిని చూసి నెటిజన్లు మైండ్ పోయింది అంటూ ఓ రేంజ్ లో కామెంట్లు పెడుతున్నారు.
అంతే కాకుండా బాగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు.మరికొందరు ఎప్పుడో విడుదలైన సినిమాకి మళ్లీ రివ్యూ ఏంట్రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.







