దుల్కర్ సల్మాన్ హీరో గా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రష్మిక మందన కీలక పాత్ర లో హను రాఘవపూడి దర్శకత్వం లో తెరకెక్కిన సీతారామం సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి సమీపించింది అంటూ సమాచారం అందుతుంది.
వీకెండ్స్ లో మాత్రమే కాకుండా వీక్ డేస్ లో కూడా ఈ సినిమా మంచి వసూళ్ల ను రాబడుతోంది.ఈ నేపథ్యంలో ముందు ముందు రాబోతున్న సెలవు రోజులు ఖచ్చితంగా ఈ సినిమా కు మంచి ఉపయోగ దాయకం అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా ఎలాగూ హిట్ అయింది కదా అని వదిలేయకుండా యూనిట్ సభ్యులు ఇంకా కూడా ప్రమోషన్ కార్యక్రమాలను చాలా జోరుగా చేస్తున్నారు.ఏ మాత్రం తగ్గకుండా ప్రతి విషయం లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమా ను ప్రమోట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
సినిమా యూనిట్ సభ్యులందరూ కూడా సోషల్ మీడియా వేదిక గా లేఖలు రాస్తూ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.ఈ సినిమా పూర్తిగా ఒక లేఖ చుట్టు తిరుగుతూ ఉంటుంది.
కనుక ఈ సినిమా ప్రమోషన్ లో కూడా లేఖ లను కీలక పాత్ర పోషించేలా చేస్తే ఈ సినిమా ఖచ్చితంగా జనాలకు కనెక్ట్ అవుతుంది అనే అభిప్రాయం తో యూనిట్ సభ్యుల ఇలా చేసినట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యం లో తాజాగా చేస్తున్న ప్రచారం సినిమా యొక్క టికెట్లు అత్యధికంగా తెగేందుకు వినియోగం గా ఉంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దుల్కర్ సల్మాన్ ని ప్రేక్షకులు తెలుగు హీరోగా స్వీకరించినట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఎన్నో మంచి ప్రేమ కథ సినిమాలు వచ్చినా కూడా ఇది ఒక అద్భుతమైన ప్రేమ కథ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.