కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో ఇసుక దోపిడీని అరికట్టాలంటూ మత్స్యకారులు రోడ్డెక్కారు.అల్లవరం మండల పరిధిలో నక్కా రామేశ్వరం తీర ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని గ్రీన్ బెల్ట్ సరుగుడు మొక్కలను నరికి వేసి టిప్పర్ల కోసం బాట ఏర్పాటు చేసుకున్నారు.ఇదేమిటని ప్రశ్నిస్తే జిల్లా కలెక్టర్ నుంచి పర్మిషన్స్ ఉన్నాయని దబాయిస్తున్నారని గ్రామస్థులు వాపోయారు.
ఈ క్రమంలో ఇసుక టిప్పర్లను అడ్డుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు.







