సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.అయితే కొంతమంది సెలబ్రిటీలు సొంతంగా ఫ్యాషన్ బ్రాండ్లను కలిగి ఉండటంతో పాటు ఆ బ్రాండ్ల ద్వారా ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు.
బ్రాండ్ కు మంచి పేరు వస్తే కళ్లు చెదిరే లాభాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సెలబ్రిటీలు ఈ దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.బాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీలు అయిన సైఫ్ అలీ ఖాన్, లారాదత్తాలకు డ్రస్, ఫ్యాషన్ బ్రాండింగ్ బిజినెస్ లు ఉన్నాయి.
దేశమంతటా ఊహించని స్థాయిలో పాపులారిటీని కలిగి ఉన్న సన్నీ లియోన్ స్టార్ స్ట్రక్ అనే లిప్ స్టిక్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్నారు.సోనమ్ కపూర్ కు, సోనమ్ కపూర్ సోదరికి సొంతంగా ఒక డ్రస్సింగ్ బ్రాండ్ ఉంది.
స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ నైకా అనే బ్రాండ్ కు పార్ట్ నర్ గా ఉంటూ ఆ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తుండటం గమనార్హం.టీషర్ట్ లు, షర్ట్ లు, షూస్ కు రాంగ్ అనే బ్రాండ్ పాపులర్ కాగా విరాట్ కోహ్లీ ఈ బ్రాండ్ కు ప్రమోటర్ గా ఉన్నారు.
మరో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హెచ్.ఆర్.ఎక్స్ అనే బ్రాండ్ కు ప్రమోటర్ గా ఉన్నారు.

ఈ బ్రాండ్ కు హృతిక్ ప్రమోటర్ కావడంతో పాటు యజమాని కూడా కావడం గమనార్హం.బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క శర్మకు నుష్ పేరుతో ఒక ఫ్యాషన్ వేర్ బ్రాండ్ ఉంది.ఫ్యాషనబుల్ డ్రెస్ లతో పాటు స్పోర్ట్స్ వేర్, క్యాజువల్ వేర్ అనుష్క బిజినెస్ భాగం కావడం గమనార్హం.

తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు సైతం సొంతంగా బాండ్లను కలిగి ఉండటం గమనార్హం.అయితే ఆ బ్రాండ్లు మరీ ఊహించని స్థాయిలో పాపులర్ అయితే కాలేదు.రాబోయే రోజుల్లో టాలీవుడ్ స్టార్స్ కూడా ఈ దిశగా అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది.







