వీడియో: అయ్యో పాపం, కొట్ట రానిచోట తోకతో కొట్టిన చేప.. అల్లాడిపోయిన యువకుడు!

ప్రపంచవ్యాప్తంగా చేపలు పట్టడం ఎక్కడైనా కనిపిస్తూనే ఉంటుంది.పెద్ద చేపలు గాలానికి దొరికితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు.

 A Fish Hit With Its Tail Where It Could Not Be Hit , Viral Latest, News Viral, S-TeluguStop.com

అయితే ఈ పెద్ద చేపలను సరిగా పట్టుకోకపోతే చాలా డేంజర్.ఒక్కోసారి ఇవి దాడిచేస్తాయి.

అయితే తాజాగా ఒక చేప తనని పట్టుకున్న ఒక వ్యక్తికి భారీ షాక్ ఇచ్చింది.ఈ చేప అతడిని కొట్టరాని చోట తోకతో కొట్టింది.

దాంతో పాపం అతడు తట్టుకోలేక చాలా తల్లడిల్లిపోయాడు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ఒక చేపని పట్టడం చూడవచ్చు.

అతడు దాన్ని మొదటగా నేలపై పడేసాడు.మళ్లీ దానిని ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లాలి అనుకున్నాడు.

ఆ సమయంలోనే “నన్ను కింద పెట్టేసేయ్, వదులేహే” అంటూ ఆ చేప అతడి చేతిలో నుంచి విడిపించుకోవడానికి తన తోకను వెనక్కి ముందుకు బలంగా ఆడించింది.ఈ క్రమంలోనే ఆ చేప తోక అతని సెంటర్ పాయింట్ లో తగిలింది.

ఆయువుపట్టుపై తగలడంతో పాపం అతడు ఆ బాధ భరించలేక అల్లాడి పోయాడు.ఈ దెబ్బకి కళ్ళు బైర్లు కమ్మడంతో ఉన్నచోటే కూలబడి పోయి అయ్యా, అమ్మ అంటూ నానా అవస్థలు పడ్డాడు.

అయితే ఈ దృశ్యం చూసి అతని భార్య తెగ నవ్వుతూ ఎంజాయ్ చేసింది.అతన్ని ఓదార్చాలింది పోయి ఆమె నవ్వుతూ ఉండటం అతన్ని మరింత బాధించింది.ఈ వీడియోను కూడా ఆమే చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేసింది.దాన్ని వైరల్ హాగ్ రీషేర్ చేయగా ఇప్పుడు అది వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.ఇంకా నయం అతడికి పిల్లలు ఉన్నారు.

లేదంటే అతడి భార్య పరిస్థితి ఏమయ్యేదో అని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.చేప బాగా ప్రతీకారం తీర్చుకుంది అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

ఈ వీడియోకి ఇప్పటికే 12 వేలకు పైగా లైకులు, లక్షల్లో వ్యూస్ వచ్చాయి.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube