న్యూయార్క్‌లో భారత సంతతికి చెందిన 30 ఏళ్ల మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.ఆమెను మన్‌దీప్ కౌర్‌గా గుర్తించారు.
భర్త రంజోద్ బీర్ సింగ్ సంధు దాదాపు ఎనిమిదేళ్లపాటు ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు.కౌర్‌కు నాలుగు, ఆరు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు వున్నారు.
భర్త, కుమార్తెలు న్యూయార్క్‌లోని రిచ్‌మండ్ హిల్‌లో వున్నారు.అతని కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందినది.
ఇన్‌స్టాగ్రామ్ పేజీ ప్రకారం.న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ కేసును ఆత్మహత్యగా కాకుండా హత్యగా దర్యాప్తు చేస్తోంది.
@TheKaurMovementలో పోస్ట్ చేసిన వీడియోలో కౌర్ తన వైవాహిక జీవితంలో తాను ఎదుర్కొన్న హింసను వివరించింది.అందులో తన గాయాలు, రక్తం గడ్డకట్టడాన్ని చూపిస్తూ తన అత్తమామలు ఎలా ప్రోత్సహించారో వివరించింది.
వాళ్లు ప్రతిరోజూ తనను కొట్టేవారని.ఏనాటికైనా తన భర్త బాగుపడతాడనే అనుకుంటూ వుండేదానినని , అతని దెబ్బలను ఎనిమిదేళ్లపాటు భరిస్తూనే వున్నానని ఆమె వాపోయింది.
కేవలం తన పిల్లల కోసమే ఓపిగ్గా వున్నానని కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు.తన తండ్రి ఈ వ్యవహారంపై పోలీసు కేసు నమోదు చేశాడని ఆమె చెప్పారు.
తన భర్త విషయంలో అత్తమామలు కూడా తనకు సహాయం చేయలేదని మన్‌దీప్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో #JusticeForMandeep హ్యాష్ ట్యాగ్‌తో ప్రజలు ఆందోళన చేపట్టారు.
అంతేకాదు రిచ్‌మండ్ హిల్‌లోని ఆమె ఇంటి వెలుపల కూడా పలువురు నిరసన చేపట్టిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.సమాజం కౌర్‌ను కాపాడటంలో విఫలైందని సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేశారు.







