ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఈ ఫలితాలను విడుదల చేశారు.64.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.టెన్త్‌ సప్లిమెంటరీకి 2,02,648 దరఖాస్తు చేయగా.1,91,800 మంది పరీక్షలు రాశారు.బాలురులో పాసైన వారి సంఖ్య 66,458 కాగా, పాసైన బాలికల సంఖ్య 56678.మొత్తంగా బాలికలు, బాలురు కలుపుకుని 1,23,231 మంది పాసయ్యారని అధికారులు తెలిపారు.అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.52 శాతం ఉత్తీర్ణత రాగా.పశ్చిమగోదావరి జిల్లా అత్యల్పంగా 46.66 శాతం ఉత్తీర్ణులయ్యారు.

 Tenth Advance Supplementary Exam Results , Supplementary Exam Results ,education-TeluguStop.com

రెగ్యులర్, అడ్వాన్స్ సప్లిమెంటరీతో కలుపుకుని మొత్తంగా పదో తరగతి పరీక్షలకి 6,06,070 పరీక్షలకి హాజరు అయ్యారని వెల్లడించారు.వీరిలో 5,37,491 మంది ఉత్తీర్ణతా సాధించారు.ఈ‌ ఒక్క సంవత్సరమే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలలో పాసైన‌వారిని రెగ్యులర్ పాస్‌గా పరిగణిస్తామని, కరోనా కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube