ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
TeluguStop.com
పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఈ ఫలితాలను విడుదల చేశారు.
64.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
టెన్త్ సప్లిమెంటరీకి 2,02,648 దరఖాస్తు చేయగా.1,91,800 మంది పరీక్షలు రాశారు.
బాలురులో పాసైన వారి సంఖ్య 66,458 కాగా, పాసైన బాలికల సంఖ్య 56678.
మొత్తంగా బాలికలు, బాలురు కలుపుకుని 1,23,231 మంది పాసయ్యారని అధికారులు తెలిపారు.అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.
52 శాతం ఉత్తీర్ణత రాగా.పశ్చిమగోదావరి జిల్లా అత్యల్పంగా 46.
66 శాతం ఉత్తీర్ణులయ్యారు.రెగ్యులర్, అడ్వాన్స్ సప్లిమెంటరీతో కలుపుకుని మొత్తంగా పదో తరగతి పరీక్షలకి 6,06,070 పరీక్షలకి హాజరు అయ్యారని వెల్లడించారు.
వీరిలో 5,37,491 మంది ఉత్తీర్ణతా సాధించారు.ఈ ఒక్క సంవత్సరమే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలలో పాసైనవారిని రెగ్యులర్ పాస్‌గా పరిగణిస్తామని, కరోనా కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
God Of Coins Player Safety And Responsible Gambling (UK)