నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వం లో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెలిసిందే.ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఈనెల పూర్తి అవుతాయని అంతా బావించారు.
కాని కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది.ఆగస్టులో షూటింగ్ పూర్తి అవుతుందని గోపీచంద్ ప్రకటించాడు.
సినిమా పూర్తి అయిన వెంటనే బాలయ్య తన తదుపరి సినిమా ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో మొదలు పెట్టబోతున్నట్లుగా అధికారికంగా వార్తలు వస్తున్నాయి.అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన నిర్మాత ఎవరు అనే విషయంలో క్లారిటీ రాలేదు.
సాధారణంగా ఒక హీరో దర్శకుడు సినిమా అనగానే ఎవరో ఒక నిర్మాత పేరు వినిపిస్తుంది కానీ ఈ కాంబోకి ఇప్పటి వరకు నిర్మాత ఎవరు అనేది అధికారికంగా ఫిక్స్ అవ్వలేదు.బాలకృష్ణ నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని ఆ మధ్య ప్రచారం జరిగింది.
కానీ బాలయ్య నిర్మాణం పై ప్రత్యేక ఆసక్తి లేడని సమాచారం అందుతుంది.దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం కథ చెప్పి నిర్మాతను ఒప్పించే బాధ్యత తీసుకున్నాడు.
దిల్ రాజు ఈ సినిమా ను నిర్మించేందుకు ఓకే అన్నాడు అనే వార్తలు కూడా వచ్చాయి.కానీ అనిల్ రావిపూడి గత చిత్రం ఎఫ్ 3 పెద్దగా ఆడక పోవడంతో దిల్ రాజు ఇప్పుడు నిర్ణయాన్ని మార్చుకున్నాడు అని తెలుస్తుంది.
ప్రముఖ నిర్మాత ఒకరు ఈ సినిమా కథను విని నేను చెయ్యను అని చెప్పేశారట, పైగా ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణం కు ముందుకు వచ్చి మళ్లీ వెనక్కు తగ్గిందని అంటున్నారు.కనుక ఈ సినిమా నిర్మాత ఎవరు, ఎప్పుడు ఈ సినిమా మొదలవుతుందా అంటూ నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది కానీ ఇప్పటి వరకు నిర్మాత ఎవరు అనేది క్లారిటీ ఇవ్వకపోవడంతో అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.ఎప్పటికప్పుడు తన సినిమాకు సంబంధించి అప్డేట్స్ను ఇస్తూ అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ ఉండేవాడు.
కానీ ఈసారి మాత్రం సినిమా అధికారిక ప్రకటన చేసి సైలెంట్ అయ్యాడు.మళ్ళీ ఎప్పటికీ సినిమాను మొదలు పెడతాడు అర్థం కావట్లేదు.సెప్టెంబర్ లేదా అక్టోబర్లో బాలకృష్ణ డేట్లు ఇచ్చారని తెలుస్తోంది.మరి అప్పటి వరకు అనీల్ రెడీగా ఉంటాడా.
ఆ లోపు నిర్మాత కూడా సెట్ అవుతాడా అనేది కూడా తెలియాల్సి ఉంది.







