నాగార్జున సాగర్ కుడి కాలువ కి నీటి ని విడుదల చేసిన ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తాగు మరియు సాగు అవసరాల నిమిత్తం కుడి కాలువ కి 2 వెలు క్యూసెక్కులు ,పవర్ జనరేషన్ ద్వారా మరో వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు ఎగువ న ఉన్న కృష్ణా నది డామ్ లు అన్ని నిండు కుండలా తలపిస్తున్నాయి అని రా బోయే రోజుల్లో నాగార్జున సాగర్ డ్యాం కూడా నిండే అవకాశం ఉందని ముందు గా నే సాగు తాగు నీటి కోసం నీటి నీ విడుదల చేస్తున్నాము అని మంత్రి అంబటి అన్నారు
భగ వంతుని దయ రాష్ట్రం లో నీ డామ్ లు అన్ని జల కలని సంతరించుకున్నాయి అని, రైతు లు గమనించి పంటలు సాగు చేసుకోవాలి అని అన్నారువెల్దుర్తి మండలం లోని వరికపుడిశాల ప్రాజక్టు అనమతుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము అని సాధ్యం ఐన అంత త్వరగా అనమతులు పొంది నిర్మాణ పనులు మొదలు పెడతాము అని అన్నారు.







