యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.సినిమా నూరు శాతం గ్రీన్ అండ్ బ్లూ మ్యాట్ పై చిత్రీకరించారు.
ప్రస్తుతం మోషన్ గ్రాఫిక్స్ టెక్నాలజీతో సినిమాను విజువల్ వండర్ గా రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నారు.రికార్డు బ్రేకింగ్ వసూళ్లు టార్గెట్ గా ఈ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు.
గత ఆరు నెలలుగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ను అంతర్జాతీయ సంస్థ తో దర్శకుడు ఓమ్ రౌత్ చేయిస్తున్నాడు.కొన్ని కారణాల వల్ల వర్క్ డిలే అవుతుందని.
ఔట్ ఫుట్ విషయంలో దర్శకుడు రాజీ పడక పోవడంతో కొన్ని సన్నివేశాలు మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తుందట.
ఖర్చు పెరగడంతో పాటు మళ్లీ సమయం ఎక్కువ తీసుకుంటుందని.
అయినా కూడా ఔట్ పుట్ అద్బుతంగా రావాల్సిందే అంటూ మేకర్స్ రాజీ పడక పోవడంతో విడుదల ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో జరుగుతున్న చిన్న చిన్న తప్పిదాల కారనంగా సినిమా విడుదల లో సమస్య లు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దేశ వ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయి భాషల్లో కూడా ఈ సినిమా ను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.కనుక ఔట్ పుట్ ను అంతర్జాతీయ సినిమా ల స్థాయిలో అంటే హాలీవుడ్ సినిమా ల రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
కనుక విడుదల వాయిదా పడ్డా.ఆలస్యం అయినా పర్వాలేదు అంటూ అభిమానులు అంటున్నారు.
ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో సీత పాత్ర లో కృతి శెట్టి నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించబోతున్నాడు.







