రాజకీయ నాయకులు గొప్పలు చెప్పుకోవడం సాధారణ విషయమే.పావలా పని చేసి రూపాయి బిల్డప్ ఇస్తుంటారు.
దేశ ప్రధాని మొదలు గ్రామాలలో సర్పంచ్ వరకు అందరూ ఈ తానులోని ముక్కలే.అంతా తామే అన్ని చేశామని, ప్రజలను ఉద్ధరించామని గొప్పలకు పోతుంటారు.
అయితే ఇలా మాటలు చెప్పేవారంతా గతంలో జరిగిన విషయాలను మరిచిపోతుంటారు.కానీ ఆ విషయాలను ప్రజలు గుర్తుంచుకుంటారని.
ప్రజలు తమను అసహ్యించుకుంటారని మాత్రం గుర్తించరు.
ఇటీవల గోదావరి వరదల కారణంగా ఏపీలోని రెండు జిల్లాల్లోని పలు ప్రాంతాలకు చెందిన వేలాది మంది ప్రజలు అష్టకష్టాలు పడ్డారు.
తొలుత వారిని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించగా…తీరిగ్గా 10 రోజుల తర్వాత అంటే వరద తగ్గిపోయిన తర్వాత సీఎం జగన్ వరద ప్రాంతాల్లో పర్యటించి ఓదార్పు యాత్ర చేపట్టారు.అయితే తన పరామర్శ యాత్రలో జగన్ భారీస్థాయిలో సినిమా డైలాగులను చెప్పారు.
వరద ఉన్నప్పుడు తాను వస్తే సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందనే బిల్డప్ ఇచ్చారు.

అక్కడితో జగన్ గొప్పలు ఆగిపోలేదు.వరదల వేళ నాలుగు మండలాలకు సంబంధించి ఇక్కడే కాపురం పెట్టిన కలెక్టర్‌ను ఎప్పుడైనా చూశారా అంటూ ప్రజలను ప్రశ్నించారు.ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా.
అందరికి సహాయం అందించేందుకు అధికారులందరూ ఇక్కడకు వచ్చారని గొప్పలు చెప్పుకున్నారు.వాస్తవం ఏంటంటే విశాఖలో హుడ్ హుడ్ తుఫాను వచ్చినప్పుడు జిల్లా యంత్రాంగం మొత్తమే కాదు ఏకంగా సీఎం వచ్చి విశాఖలో కూర్చుని పరిస్థితిని చక్కదిద్ది సహాయక చర్యలు చేపట్టిన సంగతి జగన్ మరిచిపోయినా ప్రజలు మాత్రం మరిచిపోలేదు.
ఈ విషయం తెలియక గతంతో పోలిస్తే ఎంత మార్పు వచ్చిందో గమనించాలంటూ ప్రజలకు సీఎం జగన్ విజ్ఙప్తులు చేయడం హాస్యాస్పదంగా మారింది.ఇప్పుడు ఆరుగురు కలెక్టర్లు ఉన్న విషయాన్ని గొప్పగా చెబుతున్న ముఖ్యమంత్రి జగన్.
అప్పట్లో యావత్ రాష్ట్ర ప్రభుత్వమే అక్కడే ఉండేదన్న విషయాన్ని మర్చిపోవటం దేనికి నిదర్శనమని రాజకీయ పండితులు ప్రశ్నిస్తున్నారు.ఇటీవల ప్రతి సభలోనూ పదే పదే గతాన్ని జగన్ తవ్వుకుంటూ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు.