ప్రస్తుతం యూత్ లో ఊహించని స్థాయిలో క్రేజ్ ను కలిగి ఉన్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరనే సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ నటించిన సినిమాలలో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
మరికొన్ని రోజుల్లో లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఆగష్టు 25వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి.
అయితే కాఫీ విత్ కరణ్ షోలో విజయ్ దేవరకొండ తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.తాను ఒకసారి తాగిన మత్తులో సెట్స్ కు వెళ్లానని అయితే ఆ మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి ముందురోజు పుట్టినరోజు వేడుక జరగగా ఆ సమయంలో మందు తాగానని విజయ్ దేవరకొండ కామెంట్లు చేశారు.
హ్యాంగ్ ఓవర్ లో షూట్ కు వెళ్లగా షూట్ లో రోల్ ప్రకారం తర్వాత రోజు కూడా తాగాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.
ఎక్కువగా మందు తాగడంతో నాకు ఎక్కువైపోయిందని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.
షూట్ సమయంలో డైలాగ్స్ మరిచిపోయి పిచ్చినవ్వులు నవ్వానని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.అర్జున్ రెడ్డి మూవీ సమయంలో ఈ విధంగా జరిగిందని విజయ్ దేవరకొండ తెలిపారు.
తనకు మందు అలవాటు ఉందని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.విజయ్ దేవరకొండ ఏ విషయం గురించి అయినా బోల్డ్ గా స్పందిస్తారనే సంగతి తెలిసిందే.

కెరీర్ తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రలు చేసిన విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమా తర్వాత కెరీర్ విషయంలో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదనే సంగతి తెలిసిందే.విజయ్ దేవరకొండ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా లైగర్ సక్సెస్ సాధిస్తే పాన్ ఇండియా హీరోల జాబితాలో విజయ్ దేవరకొండ కూడా చేరడం సాధ్యమేనని చెప్పవచ్చు.







