ఏపీలో స్కూల్స్ విలీనం రగడ రాజుకుంటోంది.రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పెరిగిపోతున్నాయి.
అన్ని జిల్లాల్లోనూ ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు.తమ ఊర్లో స్కూల్ ఉండాల్సిందే, మెర్జ్ చేస్తే ఊరుకునేదే లేదంటూ పోరుబాట పడుతున్నారు.
పాఠశాలల విలీనం విరమించుకోవాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలకు దిగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో విద్యా సంస్థల విలీనంపై రగడ కొనసాగుతోంది.
ఏపీలోని పలు జిల్లాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోనకు దిగుతున్నారు.విద్యార్థుల సంఖ్య తక్కువగాఉన్న స్కూళ్లను మరో గ్రామంలోని పాఠశాలలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపడుతున్నారు.
తమ ఊర్లోనే స్కూల్‌ను కొనసాగించాలని, లేదంటే బడికి పంపమంటున్నారు.పిల్లలను మరో ఊరికి పంపేదే లేదంటున్నారు.
వెంటనే పాఠశాలల విలీనాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.పాఠశాలల విలీనం వద్దు-మా బడే మాకు ముద్దు అంటూ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు.
తమ ఊర్లోనే స్కూల్‌ను కొనసాగించాలని లేదంటే అసలు పిల్లలను బడికే పంపమంటున్నారు తల్లిదండ్రులు.ఏపీలో స్కూల్స్ విలీనం వెనుక కుట్ర దాగి ఉందని ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు.
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నచోట , మరో గ్రామంలోనూ ఉన్న స్కూల్లో విలీనం చేస్తున్నారు.

ఇలా చేయడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కొన్ని చోట్ల బస్సు, ఇతర రవాణా సౌకర్యాలు లేవు.దీంతో పుస్తకాల బరువును మోసుకుంటూ విద్యార్థులు వేరే గ్రామాని వెళ్లాల్సి వస్తుంది.
దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యమంత్రి జగన్ తీసుకునే నిర్ణయాలన్నీ విడ్డురంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు.
వెంటనే పాఠశాల విలీనం మానుకోకపోతే ఆందోళనలు ఉద్రుతం చేస్తామని హెచ్చరించారు.దింతో రాష్ట్ర ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు పెరిగిపోతున్నాయి.
అన్ని జిల్లాల్లోనూ ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు.ఊర్లో స్కూల్ ఉండాల్సిందే, మెర్జ్ చేస్తే ఊరుకునేదే లేదంటూ పోరుబాట పడుతున్నారు.







