తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది వారసులుగా అడుగుపెట్టారు.ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారందరూ వారికంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు.
ఇలా ఇండస్ట్రీలోకి వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో సాయికుమార్ కుమారుడు ఆది ఒకరు.ప్రేమకావాలి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు.
ఈ సినిమా అనంతరం పలు సినిమాలలో నటించిన సాయికుమార్ కి పెద్దగా ఆశించిన మేర ఫలితాలు రాలేదని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఈయన కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరమైనా తిరిగి పలు సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి ఒక్క సెలబ్రిటీ సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ద్వారా మిలియన్ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు.
అయితే ఆది సాయికుమార్ మాత్రం ఇప్పటివరకు ఈయనకు ట్విట్టర్ ఖాతా కూడా లేదు.

ఈ క్రమంలోనే ఆది ట్విట్టర్ ఎంట్రీ ఇచ్చారు.ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా ఈయన తన మొదటి వీడియోని షేర్ చేస్తూ ఇకపై తాను తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా షేర్ చేస్తానని తనని ఫాలో అవుతూ ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నా.@iamaadisaikumar నా ట్విటర్ అకౌంట్.
ఛీర్స్ గాయ్స్.అంటూ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.ఇకపోతే ట్విట్టర్ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







