అగ్ర దర్శకుల్లో డైరెక్టర్ శంకర్ ఒకరు.ఈయన ఏ సినిమా చేసిన అది భారీ స్థాయిలో భారీ బడ్జెట్ తో నే చేస్తాడు.
అన్ని హై స్టాండర్డ్స్ ఉండేలా ప్లాన్ చేసుకుని మరి తన సినిమాలను తెరకెక్కిస్తారు.ఏదో ఒక సామజిక అంశాన్ని తీసుకుని దానిని కమర్షియల్ పంథాలో తెర పై ఆవిష్కరిస్తారు.
ఈయన కెరీర్ లో భారీ విజయాలను చాలా సార్లు సొంతం చేసుకున్నాడు.అయితే అంతే స్థాయిలో భారీ డిజాస్టర్స్ కూడా ఉన్నాయి.
అయినా కూడా లైఫ్ లో ఒక్కసారి అయినా సినిమా చేయాలనీ చాలా మంది పోటీ పడుతూ ఉంటారు.అయితే శంకర్ కెరీర్ లో ఇండియన్ 2 సినిమా మధ్యలోనే వదిలేసాడు.
కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన ఈ సినిమా ఇప్పుడు రాజీ తో మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇండియన్ 2.
ఈ సినిమాను మళ్ళీ త్వరలోనే స్టార్ట్ చేస్తున్నట్టు కమల్ హాసన్ స్వయంగా ప్రకటించి అందరిని ఆశ్చర్య పరిచాడు.లైకా ప్రొడక్షన్స్ వారు ఇప్పటికే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నట్టు టాక్.
అయితే ఇండియన్ 2 సినిమా రామ్ చరణ్ ఆర్సీ 15 తర్వాత ఉంటుంది అని అందరు భావించారు.

కానీ తాజాగా కోలీవుడ్ మీడియా నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆర్సీ 15 షూటింగ్ తో సంబంధం లేకుండా ఇండియన్ 2 సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని టాక్.ఆర్సీ 15 సినిమాతో సంబంధం లేకుండా శంకర్ కూడా ఇండియన్ 2 షూటింగ్ పనులు స్టార్ట్ చేయనున్నాడట.రెండు సినిమాలను ఒకేసారి పూర్తి చేయాలని అనుకుంటున్నాడట.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకున్నారు.
ఇక దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.ఈయన కెరీర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.







