టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన నాగచైతన్య ఏ విషయం గురించి అయినా మనసులో దాచుకోవడానికి ఇష్టపడరు.తన మనసులోని అభిప్రాయాలను బయటకు వ్యక్తీకరించే విషయంలో చైతన్య అస్సలు రాజీపడరు.
అయితే ఏ హీరోయిన్ తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుందనే ప్రశ్నకు చైతన్య ఇద్దరు హీరోయిన్ల పేర్లను జవాబుగా చెప్పారు.లవ్ స్టోరీ మూవీలో సాయిపల్లవితో కెమిస్ట్రీ బాగా కుదిరిందని చైతన్య అన్నారు.
స్టార్ హీరోయిన్ సమంతతో కూడా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుందని చైతన్య చెప్పుకొచ్చారు.సమంత నేను కలిసి ఎన్నో అందమైన ప్రేమకథలలో నటించామని చైతన్య కామెంట్లు చేశారు.
విడాకులు తీసుకున్న తర్వాత కూడా సమంత చైతన్య గురించి పాజిటివ్ గా వెల్లడించడం గమనార్హం.సమంత మాత్రం ప్రతి సందర్భంలో చైతన్యపై తన కోపాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారనే సంగతి తెలిసిందే.
గతేడాది అక్టోబర్ నెలలో చైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు చైసామ్ విడాకులకు సంబంధించి ఎన్నో కారణాలు ప్రచారంలోకి వచ్చాయి. చైతన్య లేదా సమంత స్పందిస్తే మాత్రమే వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
చైతన్య సమంత గురించి పాజిటివ్ గా మాట్లాడటం కొంతమంది అక్కినేని అభిమానులకు అస్సలు నచ్చడం లేదనే సంగతి తెలిసిందే.

చైతన్య ఈ కామెంట్ల విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.మరోవైపు లైఫ్ విషయంలో నాగచైతన్య ఆచితూచి అడుగులు వేయాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.సినిమసినిమాకు నాగచైతన్య రేంజ్ పెరుగుతుండగా చైతన్య తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మరోవైపు నాగచైతన్య కొత్త ప్రాజెక్ట్ లు పరశురామ్, వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి.ఈ రెండు సినిమాలలో ఏ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.







