1.పింగళి వెంకయ్య కుమార్తె మృతి పై ‘ తానా ‘ సంతాపం

భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి మృతిపై అమెరికా తెలుగు సంఘం (తానా ) అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తానా తరఫున సంతాపం ప్రకటించారు. 2.అమెరికా ,దక్షిణ కొరియాకు కిమ్ వార్నింగ్ అమెరికా దక్షిణ కొరియాలు ఉమ్మడిగా యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తూ తమ దేశ ప్రయోజనాలకు విగాథం కలిగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరించారు. 3.పదేళ్ల తర్వాత అమెరికాలో పోలియో కేసు నమోదు పదేళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా అమెరికాలో తొలి పోలియో కేసు నమోదు అయ్యింది.న్యూయార్క్ కు చెందిన ఓ యువకుడి లో ఈ లక్షణాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 3.శ్రీలంక కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారం

శ్రీలంక కొత్త ప్రధానిగా దినేష్ గునవర్దన ప్రమాణ స్వీకారం చేశారు. 4.వైన్ బాటిల్ చోరీ.మెక్సికన్ బ్యూటీ జంట అరెస్ట్ అత్యంత విలువైన, 200 ఏళ్ల నాటి పురాతన వైన్ బాటిల్ చోరీ కేసును 9 నెలల తరువాత పోలీసులు చేదించారు.ఈ వైన్ బాటిల్ చోరీ కేసులో మెక్షికన్ బ్యూటీ క్వీన్ రోమానియా, డచ్ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 5.శ్రీలంక లో మళ్లీ ఆందోళనలు శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం పై ఇప్పటికే ప్రజలు ఆందోళన చేస్తూనే ఉన్నారు.తాజాగా శ్రీలంక కొత్త అధ్యక్షుడు రణీల్ విక్రమ సింగే రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. 6.సిరియాపై ఇజ్రాయిల్ క్షిపణి దాడి ముగ్గురు సైనికుల మృతి

సిరియాపై ఇజ్రాయిల్ క్షిపణులతో దాడులకు దిగింది.ఈ ఘటనలో సిరియాకు చెందిన ముగ్గురు సైనికులు మృతి చెందారు. 7.ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న మంకీ ఫాక్స్ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మంకీ ఫాక్స్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.మంకీ ఫాక్స్ కేసులు ప్రపంచవ్యాప్తంగా 14,000 నమోదు కాగా , తాజాగా ఈ వైరస్ సోకి 5 గురు మరణించారు. 8.అమెరికా అధ్యక్షుడికి కరోనా పాజిటివ్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 9.ఆఫ్రికాలో మలేరియా వ్యాక్సిన్ కు డబ్ల్యూహెచ్ వో సిద్ధం తొలి ఆమోదిత మలేరియా టీకా ను ఆఫ్రికాలోని మూడు దేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిద్ధమయ్యింది.
.






